కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితమే రుణమాఫీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలొ గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితంగానే వ్యవసాయ రుణమాఫీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పుకోవడం జరిగిందన్నారు.

నాలుగు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ కోసం పోరాటం చేస్తూనే ఉందన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుందన్నారు.కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తేనే రైతులకు కనీసం 20 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా జరుగుతుందన్నారు.

ఆర్టీసీ కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పర్మినెంట్ చేస్తామని చెప్పడంతో వారిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం జరిగిందన్నారు.

రైతులు ఇప్పుడే పాలాభిషేకం జలాభిషేకం చేయవద్దని వారం రోజుల వ్యవధిలో లక్ష రూపాయల రుణమున్న రైతులందరికీ మాఫీ చేసి వారి పాసుబుక్కులు వారికి ఇస్తేనే పాలాభిషేకం చేయండి అన్నారు.

రైతులకు నమ్మకం కుదరాలన్నారు దశలవారీగా చేస్తానని మాట చెప్పి మాట తప్పడం కెసిఆర్ కు ఆనవాయితని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజు నాయక్, నాయకులు గంట బుచ్చగౌడ్ , కొత్తపల్లి దేవయ్య, చెన్ని బాబు, గుండాటి రామ్ రెడ్డి,తిరుపతి గౌడ్,లక్ష్మీనరసయ్య పాల్గొన్నారు.

బాలయ్య షోలో కన్నీళ్లు పెట్టుకున్న సూర్య.. ఏం జరిగిందంటే?