అక్కడ కెఫేలో మీకు బల్లులు, పాములు, ఉడతలు కంపెనీ ఇస్తాయి… వాటితో కలిసి భోజనం చేయొచ్చు?

వినడానికి చోద్యంగా వున్నా ఇది నిజమే.అయితే ఇలాంటివన్నీ ఇతర దేశాల్లోనే సాధ్యం అవుతాయి.

అక్కడి మనుషులు రకరకాల అభిరుచులను కలిగి వుంటారు.అలాంటి వారికోసమే పెట్ కేఫ్ లు వంటివి ఏర్పాటు చేయబడ్డాయి.

వీటి గురించి మీరు కూడా ఏదోఒక సందర్భంలో విని వుంటారు.ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇలాంటి కేఫ్ లు అత్యంత ప్రజాదరణ పొందుతూ వున్నాయి.

తాజాగా ఈ లిస్టులోకి సరీసృపాల కేఫ్ ఒకటి వచ్చి చేరింది.ఆ కేఫ్ నకు వెళ్తే పాములు, బల్లులు, ఉడతలు వంటి సరిసృపాలను చేత్తో పట్టుకొని, ఒంటిపై పాకించుకుంటూ, టేబుల్ పై పెట్టుకుని భోజనం కూడా చేయొచ్చన్నమాట.

"""/" / వివరాల్లోకి వెళితే, మలేషియాకు చెందిన సరీసృపాల ప్రేమికుడు అయినటువంటి మింగ్ యాంగ్ ఈ ప్రీమియం సరీసృపాల కేఫ్‌ను విజయవంతంగా నడిపిస్తున్నాడు.

ఈ కేఫ్ పేరు ఫెంగ్ బాయి డెకోరి.ఇక్కడకు దాదాపుగా సరిసృపాల ప్రేమికులు మాత్రమే వస్తూ వుంటారు.

అంతేకాకుండా వారు ఆ పెంపుడు జంతువులపై చాలా ప్రేమను చూపిస్తుంటారు.ఈ క్రమంలో వాటిని ప్రేమగా తాకుతూ, ముద్దులు పెట్టుకుంటూ.

ఒంటిపై పాకించుకుంటూ వెళ్ళిపోతూ వుంటారు.అంతేకాదు కాస్త భయపడే వారు కూడా ఆ కేఫ్ కు వెళ్లి.

సరిసృపాలపై ప్రేమను పెంచుకుంటారని హోటల్ కేఫ్ యజమాని యాప్ మింగ్ యాంగ్ ఈ సందర్భంగా చెబుతున్నాడు.

"""/" / ప్రస్తుతానికి దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.

పిల్లలతో సహా పెద్ద వాళ్లు ఈ కేఫ్ కు వచ్చి ఎంజాయ్ చేస్తుంటారని ఈ వీడియోలో వివరించారు.

కస్టమర్లు తమకు కావాల్సినవి ఆర్డర్ చేసి అవి వచ్చే వరకు అక్కడున్న సరిసృపాలతో సరదాగా కాలక్షేపం చేస్తూ వుంటారు.

వాటిని చేతులతో పట్టుకొని ఒంటికి హత్తుకుంటూ వుంటారు.కేఫ్ యజమాని యాప్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ.

ప్రజలు పిల్లులు, కుక్కలు వంటి అందమైన జంతువులను మాత్రమే పట్టించుకుంటారని తెలపారు.కానీ సరీసృపాలు ముఖ్యంగా పాములు వంటి వాటిని వదిలేస్తారని వివరించారు.

సరీసృపాల అధ్యయనంలో ఆసక్తి ఉన్న మలేషియన్ల సంఘంలో కేఫ్ యజమాని కూడా ఒకరు.

సినిమా రిలీజ్ అవ్వకముందే కోతలు కోసి బొక్క బోర్లా పడ్డ మేకర్స్ వీళ్లే !