లిప్ లాకులు, సినిమాలే కాదు అనిరుద్ వీటిల్లో కూడా తోపే !

అనిరుద్ రవిచంద్రన్.మనోడు మంచి మ్యూజిక్ కంపోజర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తెలుగు లో భారీ హిట్స్ లేవు కానీ తమిళం లో మాత్రం అనిరుద్ ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్.

ఇక తెలుగు లో గ్యాంగ్ లీడర్, బెస్ట్, తిరు, జెర్సీ, దర్బార్, అజ్ఞాతవాసి వంటి సినిమాలకు సంగీతం అందించాడు.

ఇక మనోడిని తొలుత గుర్తించింది మాత్రం వై దిస్ కొలెవరి పాటతోనే.కేవలం సినిమాలతోనే కాదు లైవ్ కాన్సెర్ట్స్ చేయడం లోను అనిరుద్ మహాదిట్ట.

మొన్న ఆ మధ్య ఫారెన్ కంట్రీ లో ఒక లైవ్ షో పెడితే దాదాపు పది కోట్ల రూపాయల మేర టికెట్స్ రూపం లో వచ్చాయట.

ఇంకా చాల మందికి టికెట్స్ కూడా దొరకలేదు.అంత డిమాండ్ ఉంది ప్రస్తుతం అనిరుద్ కి.

పైగా సింగర్ కం యాక్ట్రెస్ అయినా ఆండ్రియా తో లిప్ లాక్ వల్ల అనిరుద్ లో మరొక రొమాంటిక్ యాంగిల్ కూడా బయట పడింది.

ఏది ఏమైనా పుష్కలంగా ట్యాలెంట్ ఉంది కాబట్టి ఈ వేషాలు ఏమి హైలెట్ అవ్వలేదు.

"""/" / ఇక తన సంగీతం తో ఎంతలా అభిమానులను సంపాదించుకుంటున్నాడో లైవ్ కాన్సెర్ట్ కి కూడా అలాగే సంపాదించుకుంటున్నాడు.

ఈ విషయం లో అనిరుద్ తోపు అని ఒప్పుకొని తీరాల్సిందే.నిన్నటికి నిన్న ఒక లెజెండ్ కాన్సెర్ట్ హైదరాబాద్ లో నిర్వహిస్తే అద్వాన్నంగా రివ్యూ లు రావడం మనం చూస్తూనే ఉన్నాం.

ఇక ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇండియాలోనూ మరియు బయట దేశాల్లో కచేరి లు పెడితే కూడా కుప్పలు కుప్పలుగా జనాలు వచ్చేవారు.

"""/" / సింగర్ చిత్ర సైతం అనేక లైవ్ కచేరీలను చాల విజయవంతంగా చేసింది.

కానీ ఇప్పుడు ఇలా లైవ్ కాన్సెర్ట్ చేయాలంటే అది అంత సులువు అయినా పని కాదు.

గతం లో జేసుదాసు కూడా తన మొదటి లైవ్ కాన్సెర్ట్ ని తన కొడుకు సహాయం తో చక్కగా చేసిన రెండవసారి ఘోరంగా ఫ్లాప్ అయ్యింది.

మరి పెద్ద పెద్ద లెజెండ్స్ చేసిన కూడా ఇలా పరాజయం అవుతున్న కచేరీలు కేవలం అనిరుద్ లాంటి కుర్ర కంపోజర్ చేస్తే ఎందుకు సక్సెస్ అవుతున్నాయి అంటే అది పూర్తిగా మరియు సమర్ధవంతంగా చేసారని చెప్పుకోవాల్సిందే.

ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తే తొక్కేస్తారా.. గెటప్ శ్రీను షాకింగ్ కామెంట్స్ వైరల్!