వైరల్: చిన్నారి పాడిన పాటకి గిలగిలా కొట్టుకొని నవ్వుకుంటున్న నెటిజన్స్… ఓరబ్బయ్య ఆహా!
TeluguStop.com
ఈమధ్య కాలంలో మంచు ఫామిలీ పుణ్యమాని ఓ ఇద్దరికి సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ లభించింది.
ఈ పాటికే మీకు గుర్తొచ్చే ఉంటుంది.సోషల్ మీడియాలో ఇపుడు వైరల్ అవుతున్న పాటల్లో "జంపలకిడి జారు మిఠాయ" ఒకటి అయితే మరొకటి "ఒరబ్బయ్య ఆహా" అనే పాట రెండోది.
ఈ రెండు పాటలను ఇద్దరు మహిళలు మంచు విష్ణు నటించిన జిన్నా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికగా పాడగా మీమర్స్ వీటితో తెగ ఆడుకున్నారు.
కాగా ఇవి చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి జానపద గేయాలు.ఆ పాటలు సదరు సినిమాలలో కూడా ఉండటం గమనార్హం.
ఇప్పటికే జంపాలకిడి జారు మిఠాయ.పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటే ఇప్పుడు ఒరబ్బయ్య అనే పాట కూడా వైరల్ తాజాగా వైరల్ అవుతోంది.
"నువ్వొస్తావనీ నేను ఒరబ్బయ్య సిల్క్ చీర కట్టుకుంటిని" అంటూ సాగే ఈ పాటకు ఫన్నీ వీడియోలు చేస్తున్నారు మీమర్స్.
తాజాగా ఈ పాటను ఒక చిన్నారి పాడగా ఆ వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది.
వచ్చి రాని మాటలతో ఆ చిన్నారి ముద్దుముద్దుగా ఆ పాటను పాడుతూ ఉంటే నెటిజన్స్ తెగ నవ్వుకుంటున్నారు.
"""/"/
సదరు వీడియో ఇప్పటికీ లక్షల్లో వ్యూస్ రాబట్టగా, ఈ ఫన్నీ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
ఇక వీడియో ఒకసారి గమనించినట్లయితే, ఒరిజినల్ సాంగ్ లో సదరు మహిళా ఓ వాక్యం పడిన తరువాత ఓ వింత శబ్దంను చేస్తూ ఉంటుంది.
అదే శబ్దాన్ని ఆ చిన్నారి అనుకరించి చేయడం వలన ఆ వీడియో తెగ ఫన్నీగా వుంది.
దాంతో నెటిజన్లు చేత నవ్వులు పూయిస్తుంది.ఇంకెందుకాలస్యం.
మీరు కూడా ఆ ఫన్నీ వీడియో చూసి మీమీ అభిప్రాయాలు తెలియజేయండి.
తేజ ఏం సినిమా చేస్తున్నాడు…రానా మూవీ ఆగిపోయిందా..?