కాసేపట్లో ఆపరేషన్ అనగా.. డ్యాన్స్‌తో అదరగొట్టిన బాలుడు

ఏదైనా అనారోగ్యం బారిన పడితే మనం బాగా వీక్ అయిపోతాం.నీరసించిపోయి మంచానికే పరిమితమైపోతాం.

ఏ పని సరిగ్గా చేయలేం.ఆరోగ్యానికి ఏమైందోనని ఆందోళన చెందుతూ ఉంటాం.

ఇక ఏదైనా జబ్బు వచ్చినప్పుడు ఆస్పత్రికి వెళితే ఇంజెక్షన్లు, మందులు లాంటివి ఇస్తారు.

చాలామంది ఇంజెక్షన్లు వేయించుకోవాలంటేనే భయపడిపోతుంటారు.చిన్నపిల్లలు అయితే ఇంజెక్షన్ అనగానే పరిగెడతారు.

ఇంజెక్షన్ వద్దంటూ తెగ ఏడుస్తూ ఉంటారు.చివరికి వారికి బలవంతంగా ఇంజెక్షన్ వేయించాల్సి ఉంటుంది.

అలాగే కొంతమంది పెద్దవారు కూడా ఇంజెక్షన్ అంటే కొంచెం జంకుతారు. """/" / అలాగే చిన్నపిల్లలకు ఇంజెక్షన్ తో పాటు మందులు మింగాలన్నా భయమే.

మందులు మింగలేక బయటకు కక్కుతూ ఉంటాయి.ఇక ఆపరేషన్ ( Operation ) అంటే చిన్నపిల్లలు తెగ భయపడిపోతారు.

ఆపరేషన్ అంటే పెద్దవారు కూడా భయపడతారు.మన ఆరోగ్యం ఏమైందోనని తెగ భయపడుతూ ఉంటారు.

అలాంటిది ఒక బాలుడు ( Boy ) ఆపరేషన్‌కు అసలు భయపడలేదు.ఆపరేషన్ రూమ్‌లోకి వెళుతూ సెలబ్రేట్ అంటూ డ్యాన్స్ ( Dance ) వేసుకుంటూ వెళ్లాడు.

దీంతో దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. """/" / ఆపరేషన్ అనగానే చాలామంది భయపడతారు.

సక్సెస్ అవుతుందా.? లేదా? అని జంకుతారు.

కొంచెం ఆందోళనకరంగా అనిపిస్తుంది.అలాంటిది ఈ బాలుడు అసలు భయపడకుండా డ్యాన్స్ వేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

ఈ బాలుడి గుండె, వెన్నుముకకు అది పెద్ద సర్జరీ చేసేందుకు డాక్టర్లు ఏర్పాట్లు చేశారు.

పిల్లవాడు హాస్పిటల్ గౌను వేసుకుని కారిడార్‌లో ఆపరేషన్‌కు వెళ్లేముందు డ్యాన్స్ వేస్తున్నాడు.రకరకాల మూమెంట్స్‌లో డ్యాన్స్ వేశాడు.

పీపుల్ మ్యాగజైన్ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ వీడియోను షేర్ చేశారు.

దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.ఈ పిల్లవాడి ధైర్యానికి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

హమ్మయ్య బన్నీకి రిప్లై ఇచ్చిన పవన్… విభేదాలు మొత్తం తొలగిపోయినట్టేనా?