రెండు పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్లే?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా పని చేస్తున్నటువంటి ఎంతోమంది సెలబ్రిటీలో ప్రేమ వివాహాలు చేసుకుని ప్రస్తుతం తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే చాలా మంది సెలబ్రిటీలు ప్రేమించుకొని బ్రేకప్ చెప్పుకోవడం పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుని విడిపోయారు.
ఇలా విడాకులు తీసుకొని విడిపోయినటువంటి వారు తిరిగి మరోసారి పెళ్లి చేసుకుని జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపు పొందిన వారిలో పలువురు హీరోలు రెండు పెళ్లిళ్లు చేసుకున్నటువంటి వారు కూడా ఉన్నారు.
మరి రెండు పెళ్లిళ్లు చేసుకున్నటువంటి టాలీవుడ్ స్టార్స్ ఎవరు అనే విషయానికి వస్తే.
నందమూరి తారక రామారావు: నందమూరి తారకరామారావు ( NTR ).సీనియర్ హీరో ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఈయన బసవతారకం అనే అమ్మాయిని మొదట వివాహం చేసుకున్నారు.ఇలా వీరిద్దరికీ పిల్లలు పుట్టి వారు పెళ్లి చేసుకున్న తర్వాత క్యాన్సర్ తో బాధపడుతూ బసవతారకం చనిపోయారు.
ఇక రాజకీయాలలోకి వచ్చిన ఎన్టీఆర్ ఎంతో ఒత్తిడి ఎదుర్కొని ఒంటరి జీవితం అనుభవిస్తున్నటువంటి తరుణంలో లక్ష్మీపార్వతి దగ్గరయ్యారు ఈ క్రమంలోనే లక్ష్మీపార్వతిని ఈయన రెండో పెళ్లి చేసుకున్నారు.
అక్కినేని నాగార్జున: అక్కినేని నాగేశ్వరరావు కుమారుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నాగార్జున( Nagarjuna ) మొదట దగ్గుబాటి వెంకటేష్ సోదరి లక్ష్మీని వివాహం చేసుకున్నారు.
ఈ దంపతులకు నాగచైతన్య కూడా జన్మించారు.అయితే నాగచైతన్య జన్మించిన తర్వాత వీరిద్దరి మధ్య వచ్చిన కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.
అనంతరం నాగార్జున నటి అమలను ప్రేమించి ఆమెను రెండు వివాహం చేసుకున్నారు.ఈ దంపతులకు అఖిల్ జన్మించారు ప్రస్తుతం వీరిద్దరూ సంతోషంగా ఉన్నారు.
"""/" /
మోహన్ బాబు: మోహన్ బాబు( Mohan Babu ) కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు.
మొదట ఈయన శ్రీ విద్యా అనే మహిళను వివాహం చేసుకున్నారు.ఈమెకు ఇద్దరు సంతనం విష్ణు మంచు లక్ష్మి తన మొదటి భార్యకు జన్మించిన పిల్లలు అయితే కొన్ని కారణాల వల్ల మోహన్ బాబు మొదటి భార్య శ్రీ విద్య మరణించడంతో మోహన్ బాబు మొదటి భార్య చెల్లెలిని రెండో వివాహం చేసుకున్నారు.
ఈ దంపతులకు మంచు మనోజ్ జన్మించారు. """/" /
పవన్ కళ్యాణ్: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) మొదటి నందిని అనే మహిళను పెళ్లి చేసుకున్నారు.
ఆమెతో విభేదాల కారణంగా విడిపోయారు.అనంతరం రేణు దేశాయిని వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.
పిల్లలు జన్మించిన తర్వాత తనతో విభేదాలు రావడంతో పవన్ కళ్యాణ్ మూడో వివాహం చేసుకున్నారు.
"""/" /
మంచు మనోజ్: మోహన్ బాబు వారసుడిగా మంచు మనోజ్ ( Manchu Manoj ) అందరికీ ఎంతో సుపరిచితమే ఈయన మొదటిసారి పెద్దలు కుదిరిచినటువంటి వివాహం చేసుకున్నారు ఇలా ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి మనోజ్ తనతో విభేదాలు రావడంతో పెళ్లైన రెండు సంవత్సరాల వ్యవధిలోని విడిపోయారు.
ఇటీవల ఈయన తిరిగి భూమా మౌనిక రెడ్డిని రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
మౌనిక రెడ్డితో వివాహమైన అనంతరం ఈయన తన వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా బిజీగా గడుపుతున్నారు.
కన్నప్ప రిలీజ్ వాయిదా.. వాళ్లకు క్షమాపణలు చెప్పిన హీరో మంచు విష్ణు!