2022 లో సెలవుల జాబితా.. ఎన్ని సాధరణ సెలవులు ఉన్నాయో తెలుసా..?!

దాదాపు రెండు సంవత్సరాల పాటు కరోనా మహమ్మారి దేశంలోని ప్రజలందరిని ఊపిరి ఆడనివ్వకుండా చేసింది.

ఈ సంవత్సరం 2021 మరోకొన్ని రోజుల్లో ముగియనుంది.ఈ క్రమంలోనే కరోనా కాలానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి ప్రజలు అందరు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో రాబోయే కొత్త సంవత్సరంలో ఎన్నిసెలవులు ఉంటాయో అని అందరు ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు కదా.

అందుకే వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవులపై ఇప్పటికే బ్యాంకులు స్పష్టతను ఇచ్చాయి.అలాగే తెలంగాణ రాష్ట్రంలో సాధారణ సెలవులు, ఆప్షనల్ సెలవుల గురించి, పెయిడ్ హాలిడేస్ గురించి ప్రభుత్వం జీవో నంబర్ 2618, 2619 కు సంబందించిన ఉత్తర్వులను జారీ చేసింది.

ఈ సెలవుల్లో భాగంగా 2022 సంవత్సరానికి గాని 28 సాధారణ సెలవులు, 23 అప్షనల్ సెలవుతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో కలిప 23 పెయిడ్ హాలిడేస్ గా నిర్ధారిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు.

మరి ఆ సెలవులు ఏ ఏ రోజుల్లో వచ్చాయో తెలుసుకుందామా.జనవరి 1 - శనివారం - నూతన సంవత్సరం, జనవరి 14 -శుక్రవారం -భోగి పండగ, జనవరి 15 -శనివారం - సంక్రాంతి, జనవరి 26 -బుధవారం -రిపబ్లిక్ డే, మార్చి 1 - మంగళవారం -మహాశివరాత్రి, మార్చి 18 -శుక్రవారం -హోలీ, ఏప్రిల్ 2 -శనివారం -ఉగాది, ఏప్రిల్ 5 -మంగళవారం -జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 10- ఆదివారం -శ్రీరామనవమి, ఏప్రిల్ 14 -గురువారం -అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 15 -శుక్రవారం -గుడ్ ఫ్రైడే, మే 3 -మంగళవారం -రంజాన్, మే 5 -బుధవారం -రంజాన్ తర్వాతి రోజు.

"""/" / జులై 10 - ఆదివారం - బక్రీద్, జులై 25 -సోమవారం -బోనాలు, ఆగస్టు 9 - మంగళవారం -మొహర్రం, ఆగస్టు 15 -సోమవారం -స్వాతంత్రదినోత్సవం ఆగస్టు 20 - శనివారం -శ్రీకృష్ణాష్టమి, ఆగస్టు 31 - బుధవారం - వినాయక చవితి, సెప్టెంబర్ 25 - ఆదివారం -బతుకమ్మ తొలిరోజు, అక్టోబర్ 2 -ఆదివారం -గాంధీ జయంతి, అక్టోబర్ 5 -బుధవారం విజయదశమి, అక్టోబర్ 6 -గురువారం -దసరా తర్వాతి రోజు,అక్టోబర్ 9 -ఆదివారం -ఈద్ మిలాదున్ నబీ, అక్టోబర్ 25 -మంగళవారం -దీపావళి, నవంబర్ 8 - మంగళవారం -కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి, డిసెంబర్ 25 - ఆదివారం - క్రిస్మస్, డిసెంబర్ 26 -సోమవారం -బాక్సింగ్ డే.

"""/" / అయితే జనవరి 1న నూతన సంవత్సరం రోజున సెలవు ప్రకటించగా ఆ సెలవును ఫిబ్రవరి 12 రెండో శనివారంతో భర్తీ చేసారు.

అంటే రెండో శనివారం కూడా పనిదినంగా పరిగణిస్తారు అన్నమాట.అలాగే ఆ సెలవులతో పాటు 23 ఐచ్ఛిక సెలవులు కూడా ఉంటాయి.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు అయితే సాధారణ సెలవులు మాత్రమే కాకుండా ఐదు ఐచ్ఛిక సెలవలు కూడా పొందొచ్చు.

అయితే ఈ సెలవులు అనేవి పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు, విద్యా సంస్థలు, ప్రజా పనుల శాఖలకు వర్తించవని స్పష్టం చేసారు.

అటువంటి సంస్థలకు కొత్త ఉత్తర్వుల జారీ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.వచ్చే ఏడాది అనగా 2022లో మొత్తం ఆదివారాలు, రెండో శనివారాలు కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు 28 రోజులపాటు సాధారణ సెలవులు ఉంటాయి.

రాత్రి సమయంలో స్నానం చేస్తే.. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..?