మీరు పర్మినెంట్ వర్క్ ఫ్రం హోం జాబ్ కోసం చూస్తున్నారా? అయితే.. ఈ 7 కంపెనీల్లో ట్రై చేయండి!
TeluguStop.com
కరోనా విపత్తు తరువాత లాక్డౌన్ కారణంగా ప్రపంచ ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.
ఈ క్రమంలో చాలామంది ఉద్యోగస్తులు ఇంటినుండి తమ విధులను నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నిరంతరం ఓ సర్కిల్లో కొట్టుకుంటున్న మనిషికి లాక్డౌన్ ( Lockdown ) అనేది పెద్ద గుణపాఠాన్ని నేర్పింది.
ఇంటిపట్టునే వుంటూ తమ కుటుంబానికి ఆసరాగా వుంటూ మరోవైపు పనులు చేసుకొనేవారు ఉద్యోగస్తులు.
ఈ క్రమంలో మనవాళ్ళు వర్క్ ఫ్రం హోం( Work From Home ) జాబ్ కి బాగా అలవాటు పడ్డారు.
"""/" /
ఇక కరోనా తరువాత, అంటే ప్రస్తుతం చాలా కంపెనీలు తమ ఉద్యోగస్తులను మరలా తమ విధులను ఆఫీసులలో నిర్వహించాలని పిలుస్తున్న పరిస్థితి వచ్చింది.
అయితే ఇది చాలామందికి మింగుడు పడడం లేదు.అందుకే కొంతమంది పూర్తిగా ఇంటివద్దనుండే పనిచేస్తామని, లేదంటే రిజైన్ చేస్తున్న పరిస్థితి వుంది.
ఈ క్రమంలో చాలా కంపెనీలు పర్మినెంట్ వర్క్ ఫ్రం హోం జాబ్ ఆఫర్ చేస్తున్నాయి.
ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. """/" /
ఈ లిస్టులో మొదటిది "మిన్నెసోటా మైనింగ్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ"( Minnesota Mining And Manufacturing Company ) ఈ కంపెనీ ఉద్యోగులకు వారు ఎక్కడ పని చేయాలో ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.
ఇక రెండవ కంపెనీ 'Airbnb కంపెనీ.' ఈ కంపెనీ తమ ఉద్యోగులను ఎక్కడి నుండైనా శాశ్వతంగా పని చేయడానికి అనుమతిస్తుంది.
ఈ లిస్టులో మూడవది 'Atlassian సాఫ్ట్‌వేర్ కంపెనీ'.ఈ కంపెనీ ఉద్యోగులు కూడా శాశ్వతంగా ఇంటి నుంచే పని చేయవచ్చు.
అదేవిధంగా 'AWeber కమ్యూనికేషన్స్', 'బ్లాక్ బాడ్ కంపెనీ', 'డ్రాప్ బాక్స్', 'హబ్ స్పాట్' కంపెనీలు శాశ్వతంగా ఇంటినుండే విధులు నిర్వహించొచ్చని చెబుతున్నాయి.
ఐటీ జాబ్స్ కోసం ఇంత పోటీనా.. ఈ వీడియో చూస్తే స్టూడెంట్ల గుండెలు అదిరిపోతాయి!