చిరంజీవి సాధించిన హ్యాట్రిక్ హిట్లు .. మరే హీరోకైనా ఆ సత్తా ఉందా?
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి.తను చేసిన సినిమాలు సాధించిన విజయాలు మామూలువి కాదు.
తన సినిమాలు సాధించిన వసూళ్లు అప్పట్లోనే సంచలనం సాధించాయి.ఘరనా మొగుడు సినిమా అప్పట్లోనే రూ.
10 కోట్లు వసూలు చేసిందంటే మామూలు విషయం కాదు.బిగ్ బాస్ చిరంజీవి కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్.
అయినా చక్కడి వసూళ్లు సాధించింది.చిరంజీవి సినిమా ఫ్లాపైనా మంచి వసూళ్లే వచ్చేవి.
కొంత కాలం తర్వాత ఆయన సినిమా విడుదల అయ్యిందంటే చాలు జయఅపజయాలతో సంబంధం లేకుండా వంద రోజులు ఆడిన సినిమాలు చాలా ఉన్నాయి.
అంతేకాదు.హ్యాట్రిక్ విజయాల్లో చిరంజీవి కొత్త రికార్డు సాధించాడు.
అందేంటో ఇప్పుడు చూద్దాం. """/"/
1987లో చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది.
ఆ తర్వాత వచ్చిన స్వయం కృషి, జేబు దొంగ హిట్లతో హ్యాట్రిక్ ఖాతాలో వేసుకున్నాడు.
1988లో యముడికి మొగుడుతో మరో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.ఆ తర్వాత ఖైదీ నెంబర్ 786, మరణమృదంగం విజయాలతో మరోసారి హ్యాట్రిక్ సాధించారు.
1990లో కొండవీటి దొంగ హిట్ అయ్యింది.ఆ తర్వాత వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి ఇండస్ట్రీ హిట్ సాధించింది.
అనంతరం కొదమసింహంతో హ్యాట్రిక్ హిట్ పొందాడు. """/"/
అటు 1991లో గ్యాంగ్ లీడర్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.
దీని తర్వాత రౌడీ అల్లుడు సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది.ఆ తర్వాత వచ్చిన ఘరానా మొగుడు ఇండస్ట్రీ హిట్ అయింది.
1997లో హిట్లర్ తో హిట్ కొట్టారు.ఆ తర్వాత మాస్టర్, బావగారూ.
బాగున్నారా, చూడాలని ఉంది, స్నేహం కోసం.ఇలా వరుస విజయాలు సాధించాడు.
2002లో ఇంద్రతో మరో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.ఆ తర్వాత వచ్చిన ఠాగూర్ బ్లాక్ బస్టర్ సాధించింది.
ఆ తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలతో విజయాలను ఖాతాలో వేసుకున్నారు.
పాన్ ఇండియా సినిమాలు చేయడం అందరి హీరోల వల్ల అవ్వదా..?