మూడోసారి తల్లి కాబోతున్న అందాల నటి!

బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ గ్లామర్ నటి లీసా హెడెన్.తను మోడల్ గా మంచి గుర్తింపు పొందిన తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ గ్లామర్ బ్యూటీ సినీ అవార్డులను కూడా అందుకుంది.

ఇదిలా ఉంటే లీసా 2016 అక్టోబర్ లో డినో లాల్వణి ను పెళ్లి చేసుకుంది.

సోషల్ మీడియాలో పోస్టులను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ బిజీగా ఉంటుంది. """/"/ 2010 లో ఐషా సినిమాతో తొలిసారి బాలీవుడ్ లో అడుగుపెట్టింది.

అంతేకాకుండా 2012 లో తెలుగులో రచ్చ సినిమా లో నటించింది.ఇదిలా ఉంటే 2016 లో తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంది.

2017 మే 17 న బేబీ బాయ్ కి జన్మనిచ్చింది.తన పేరు జాక్ అని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

ఆ తరువాత 2020 లో రెండవసారి కొడుకు లియో కు జన్మనిచ్చిన సంగతి తెలిపింది.

తాజాగా ఫిబ్రవరి 8న సోషల్ మీడియాలో మూడోసారి తల్లి కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకుంది.

ఈ విధంగా కొన్ని విషయాలు తెలుపుతూ.ఇన్నాళ్లు బద్దకం కారణంగా ఈ ప్రకటన చేయడం కాస్త ఆలస్యమైంది అంటూ ఇప్పుడు తను ప్రేక్షకులతో చాట్ చేయడానికి కారణం ఉందని తెలిపింది.

ఈ విధంగా ఓ వీడియోను విడుదల చేయగా అందులో తను రెస్ట్ తీసుకుంటూ ఉండగా తన పెద్ద కొడుకు జాక్ తన దగ్గరికి వచ్చాడు.

ఈ విధంగా తాను మాట్లాడుతున్న సమయంలో జాకీ అమ్మ పొట్టలో ఎవరు ఉన్నారు వీళ్లకు చెప్తావా అంటూ లీసా ప్రశ్నించింది.

దీంతో ఇందులో చెల్లెలు ఉందని అనగా ఇద్దరూ ఒకే సారి గట్టిగా అరిచారు.

ఇక అంతే కాకుండా లీసా కూడా అమ్మాయి పుడుతుందని ఊహించుకుంటున్నానని తెలిపింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఫేషియ‌ల్ హెయిర్ ను రిమూవ్ చేసే న్యాచుర‌ల్ రెమెడీస్ ఇవే!