దగ్గు, గొంతు నొప్పి, కఫం తో బాధపడుతున్నారా.. అయితే అతి మధురం ఉందిగా అండగా!!

వర్షాకాలం( Rainy Season ) ప్రారంభం అయ్యింది.ఈ సీజన్ లో సహజంగానే దగ్గు, గొంతు నొప్పి, కఫం( Cough, Sore Throat, Phlegm ) వంటివి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి.

ఇవి చిన్న సమస్యలుగానే అనిపించిన తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తాయి.దీంతో వాటిని వదిలించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే మీకు అతి మధురం చాలా బాగా సహాయపడుతుంది.

అతిమధురం ఒక తియ్యని వేర్లు గల మొక్క.ఆయుర్వేద వైద్యంలో శక్తివంతమైన ఔషధంగా ప్రసిద్ధి చెందింది.

పేరుకే కాదు రుచికరంగా కూడా ఇది మధురంగానే ఉంటుంది.అలాగే మన ఆరోగ్యానికి తోడ్పడే అనేక పోషకాలు మరియు ఔషధ గుణాలు అతి మధురంలో నిండి ఉంటాయి.

జీర్ణ సమస్యలు మొదలుకొని ఆయాసం, మలబద్ధకం, రక్తహీనత, నీరసం, గుండె దడ, ఎముకల బలహీనత వంటి ఎన్నో అనారోగ్య సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుంది.

అలాగే దగ్గు, గొంతు నొప్పి, గొంతు వాపు, కఫం వంటి సమస్యలను సైతం వదిలించే సత్తా అతిమధురం కు ఉంది.

"""/" / అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని వాటర్ పోసుకోవాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే వన్ టీ స్పూన్ అతి మధురం వేరు పొడి( Very Sweet Root Powder ) వేసి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్తైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరు వెచ్చగా అయిన తర్వాత సేవించాలి.

ఈ అతి మధురం కషాయం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. """/" / ముఖ్యంగా రోజుకు ఒకసారి ఈ కషాయాన్ని కనుక తీసుకుంటే గొంతు నొప్పి, గొంతు వాపు, దగ్గు వంటి సమస్యలు దూరం అవుతాయి.

కఫం మొత్తం కరిగిపోతుంది.జలుబు సమస్య ఉన్న కూడా త‌గ్గు ముఖం పడుతుంది.

అతిమధురం కషాయంలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.ఇవి మన రోగ నిరోధక వ్యవస్థను బలపరిచి ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి తోడ్పడతాయి.

అంతేకాకుండా అతి మధురం కషాయాన్ని నిత్యం తీసుకోవడం వల్ల కడుపులో పుండ్లు తగ్గుతాయి.

జీర్ణవ్యవస్థ పనితీరు చురుగ్గా మారుతుంది.మలబద్ధకం సమస్య ఉంటే పరార్ అవుతుంది.

తెలుగులో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్న మోహన్ లాల్…