వాట్ ఎ ఐడియా.. వాటర్ ట్యాంక్ లో లిక్కర్...

ప్రస్తుత కాలంలో కొందరు మంచి పనుల ముసుగులో చెడ్డ పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన అబాసు పాలవుతున్నారు.

సరిగ్గా అలాంటి సంఘటనే బీహార్ రాష్ట్రంలోని బీమ్ ఆర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని బీమార్ ప్రాంతంలో ప్రభుత్వం మధ్య పానాన్ని పూర్తిగా నిషేధించింది.

దీంతో మందుబాబులు ఎంత రేటు అయినా పెట్టి కొనడానికి సిద్ధపడుతున్నారు.దీన్నేఆసరాగా తీసుకున్నటువంటి మద్యం వ్యాపారులు మద్యపానాన్ని సరఫరా చేసేందుకు కొత్త పుంతలు తొక్కుతున్నారు.

ఇందులో భాగంగా నీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంకులలో మద్యపాన బాటిళ్లను సరఫరా చేస్తున్నారు.

దీనిపై ఎవరికీ అనుమానం రాకుండా ఈ వాటర్ ట్యాంకులపై   ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టినటువంటి పలు పథకాల పేర్లను ఉపయోగిస్తూ మద్యపానం విచ్చలవిడిగా సప్లై చేస్తున్నారు.

"""/"/ అయితే ఈ విషయంపై సమాచారం అందుకున్న టువంటి పోలీసులు వాటర్ ట్యాంకులను తనిఖీలు చేయగా అందులో ఉన్నటువంటి మద్యం బాటిళ్లను చూసి ఒక్క సారిగా విస్తుపోయారు.

దీంతో వెంటనే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని వాటర్ ట్యాంకులను సీజ్ చేశారు.

నా స్ట్రెచ్ మార్క్స్ చూపించమని ఆ డైరెక్టర్ అడిగారు : ఆమని