మందును తరలించడానికి వీరు ఏం చేశారో తెలుసా?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.దాని ఫలితంగానే మందు ధరలు అమాంతం పెరిగిపోయాయి.

దీని కారణంగా మందు వినియోగం రాష్ట్రంలో తగ్గుముఖం పట్టింది.రాష్ట్రంలో ఆకాశాన్నంటుతున్న మందు ధరలను చూసి మందు బాబులు మందు తాగడానికి ధైర్యం చేయట్లేదు.

దీంతో ఈ టైంని క్యాష్ చేసుకోవడానికి కొందరు ప్రబుద్ధులు పక్క రాష్ట్రం నుండి ఏపీలోకి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారు.

ఈ అక్రమ రవాణాను ఏపీ పోలీసులు ఎప్పటికప్పుడు చాకచక్యంగా వ్యవహరిస్తూ కట్టడి చేస్తున్నారు.

తాజాగా ఇలా తెలంగాణ రాష్ట్రం నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న కొందరు ప్రబుద్ధులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరు తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ లోకి మద్యాన్ని అక్రమంగా తేవడానికి సరికొత్త టెక్నిక్ ని ఉపయోగించారు.

దీన్ని చూసిన పోలీసులు కూడా విస్తుపోయారు.ఈ ప్రబుద్ధులు సిలిండర్ కింద ఒక మూతను ఏర్పరిచి సిలిండర్ లో దాదాపు 100 క్వార్టర్ బాటిల్ లను ఉంచి తెలంగాణ నుండి ఆంధ్రాకు తరలిస్తున్న వీరు జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్ గారి చేతికి దొరికారు .

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

దానిపై మీరు కూడా ఓ లుక్ వేయండి.

Anaparthi TDP : తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ నిరసన