నకిలీ మద్యం సేవించి ఏకంగా 21 మంది మృతి

మద్యం దొరకక మందుకి బానిసైన వారు శానిటైజర్ తాగేసి తొమ్మిది మంది చనిపోయిన ఘటన ఏపీలో ప్రకాశం జిల్లాలో కారంచేడులో చోటు చేసుకుంది.

ఈ ఘటన మరువక ముందే ఇలాంటి ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది.

మద్యానికి బానిసైన ప్రజలకి లిక్కర్ దొరకకపోవడంతో గ్రామీణ ప్రాంతాలలో నాటుసారా వైపు మొగ్గు చూపిస్తున్నారు.

అయితే ఇలాంటి సమయంలో వారు తాగిన నాటుసారాలో కారణంగా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు.

అమృత్‌సర్‌లో నకిలీ మద్యం సేవించి ఏకంగా 21 మంది చనిపోయారు.ఈ ఘటన దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనంగా మారింది.

ఈ ఘటనపై సీఎం అమరీందర్ సింగ్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు.మృతులంతా అమృతసర్, గురుదాస్ పూర్, టార్న్ తరన్‌ ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు.

బటాలా ప్రాంతంలో నకిలీ మద్యం సేవించడం వల్ల మొదట ఏడుగురు మరణించినట్లు వార్తలు రాగా, ఆ మరణాల సంఖ్య ఆ చుట్టుపక్కల గ్రామాలలో కలుపుకొని 21కి చేరుకుంది.

అమృత్‌సర్ గ్రామంలోని తార్సిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూన్ 29 న 5 మంది మరణించారని వార్తలు వచ్చాయి.

తరువాత, జూలై 30 సాయంత్రం ముచ్చల్ గ్రామంలో మరో నలుగురు మరణించారు.కాగా బటాలా పట్టణంలో మాత్రం శుక్రవారం ఏకంగా ఏడుగురు మరణించారు.

ఇవే కాకుండా టార్న్ తరన్‌లో నలుగురు మరణించారు.ముచ్చల్ గ్రామం అమృత్‌సర్ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ప్రాణాలు కోల్పోయిన ప్రజలందరూ దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకి చెందిన వారు కావడం గమనార్హం.

స్థానికంగా నకిలీ మద్యం అమ్మకాలు నియంత్రించక పోవడమే ఇన్ని మరణాలకి కారణం అని స్థానికంగా ఉన్న సామాజిక వేత్తలు అంటున్నారు.

భారత్‌తో అమెరికా ప్రయోజనాలు పరిరక్షించబడతాయి : ఇండో అమెరికన్ కమ్యూనిటీ లీడర్