లిప్ లాక్ తో ప్రమోషన్ ఓకే.. సినిమా సంగతేంటో?

ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా చేయడానికి రెడీగా ఉండే వారే మంచి నటులు అవుతారు.

క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏం చేయడానికైనా వెనుకాడకూడదు.తాజాగా పలువురు హీరోయిన్లు సైతం ఇదే సూత్రాన్ని పాటిస్తున్నారు.

అయితే రొమాన్స్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.అంగాంగ ప్రదర్శన.

అవసరమైన చోట లిప్ లాక్ లకు కూడా వెనుకాడ్డం లేదు.అర్జున్ రెడ్డి సినిమా తర్వాత పలు సినిమాల్లో లిప్ లాక్ లు కామన్ అయ్యాయి.

క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి లిప్ లాక్ కు ఓకే చెప్పాం అనేది కామన్ గా వినిపించే మాట.

అర్జున్ రెడ్డి సినిమా లవ్ అండ్ రొమాంటిక్ సినిమా.అందులో లిప్ లాక్ లను జనాలు రిసీవ్ చేసుకున్నారు.

తాజాగా వచ్చిన రౌడీ బాయ్స్ సినిమాలోనూ ఆశీష్, అనుమప పరమేశ్వర్ మధ్య లిప్ లాక్ సీన్లు ఉన్నాయి.

అటు హీరో సినిమాలోనూ ఓ లిప్ లాక్ ఉంది.హీరోయిన్ నిధి అగర్వాల్, అశోక్ గల్లా లిప్ లాక్ చేసుకున్నారు.

తాజాగా శ్యాం సింగ రాయ్ సినిమాలోనూ కృతి శెట్టితో నేచురల్ స్టార్ నాని లిప్ లాక్ పెట్టాడు.

అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా హిట్లు అందుకోలేదు. """/"/లిప్ లాక్ లు మాత్రమే బాగా హైలెట్ అయ్యాయి.

లిప్ లాక్ కోసం ఆయా సీన్లు కూడా అంతగా డిమాండ్ ఏమీ చేయలేదు కూడా.

కావాలని అక్కడ లిప్ లాక్ లను పెట్టినట్లుగానే ఉంది.ఈ సినిమాల్లో శ్యాం సింగ రాయ్ సినిమా మాత్రమే ఫర్వాలేదు అనిపించింది.

"""/"/ తాజాగా పలు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.రవితేజ ఖిలాడీ అనే సినిమా చేశాడు.

ఇందులో మీనాక్షి చౌదరితో లిప్ లాక్ చేశాడు.తాజాగా విడుదలైన ట్రైలర్ లో ఈ సీన్ బాగా హైలెట్ అయ్యింది.

అటు సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేసిన డీజే టిల్లు సినిమాలోనూ లిప్ లాక్ ఉంది.

హీరోయిన్ నేహా శెట్టితో హీరో లిప్ లాక్ చేస్తాడు.సినిమా ప్రమోషన్ లో ఈ రెండు సినిమాలకు లిప్ లాక్స్ బాగా కలిసి వచ్చాయి.

సినిమాలు ఎలా ఉంటాయి? అనేది త్వరలోనే తెలియనుంది.

ఏంటి భయ్యా.. యమలోకానికి పిలుపు వచ్చిందా? బండి అలా తోలుతున్నావ్(వీడియో)