జూకీపర్‌పై మగసింహం అటాక్.. ఆడ సింహం ఎలా ఆపిందో చూడండి..

సింహాలు అడవి జంతువులు.ఈ క్రూర మృగాలు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో చెప్పలేని పరిస్థితి.

ఎన్నో ఏళ్లుగా వీటిని పెంచుతున్నా ఇవి ఒక్కోసారి యజమానులపై దాడి చేస్తాయి.వీటికి సంబంధించిన షాకింగ్ వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి.

తాజాగా అలాంటి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అందులో ఒక జూకీపర్‌పై( Zookeeper ) ఒక సింహం దాడి చేయడం, ఆ తర్వాత ఒక ఆడ సింహం( Lioness ) ఆ దాడిని అడ్డుకోవడం కనిపించింది.

"నేచర్ ఇస్ అమేజింగ్" అనే ట్విట్టర్ ఖాతా ఈ వీడియోను ఇటీవల అప్‌లోడ్ చేసింది.

వీడియోలో, ఒక అనుభవం లేని జూకీపర్‌ సింహాల మందలోకి వెళ్లడం కనిపిస్తుంది.ఒక మగ సింహం అతనిపై దాడి( Attack ) చేసి, అతనిని నేలపై పడేసి లాగుతుంది.

ఆ సమయంలో, మరొక ఆడ సింహం జోక్యం చేసుకుంటుంది.మొదటి సింహాన్ని( Lion ) వెనక్కి నెట్టివేస్తుంది.

ఈ ఘటన చాలా భయానకంగా అనిపించింది.ఆ జంతు సంరక్షకుడు ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటాడు.

ఒక సింహం అతనిపై దాడి చేయడంతో పరిస్థితి చాలా భయానకంగా మారుతుంది.సింహం జంతు సంరక్షకుడిని నేలపైకి లాగే ప్రయత్నం చేస్తుండగా, ఆడ సింహం దూరంగా నిలబడి ఆ జంటను చూస్తోంది.

"""/" / ఆపై ఆ శివంగి అద్భుతమైన ధైర్యంతో దాడిని ఆపడానికి ప్రయత్నిస్తుంది.

అది వేగంగా దూకి, దాడి చేస్తున్న సింహాన్ని గట్టిగా పట్టుకుని, జంతు సంరక్షకుడి నుంచి దూరంగా లాగుతుంది.

ఆమె చర్యలు చాలా వేగంగా, నిర్ణయాత్మకంగా ఉండి, జంతు సంరక్షకుడిని కాపాడే లాగా ఉంటాయి.

"""/" / ఈ మనుషులు మనవాళ్లే, వాళ్లపై దాడి చేయవద్దు మనకి ఎలాంటి హాని తలపెట్టరు అని ఈ ఆడ సింహం మగ సింహాన్ని వారిస్తుంది.

ఇవి రెండు క్రూర మృగాలే కానీ ఒకటి మనుషులు లాగా ఆలోచించి దాడి చేయవద్దు అని ఆపడం ఆశ్చర్యపరిచింది.

అదృష్టం కొద్దీ ఈ దాడిలో జూ కీపర్ చనిపోలేదు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

ఓరి నాయనో.. ఈ అవ్వ మజిల్స్ చూస్తే మతిపోతుంది..?