వైరల్ వీడియో: అయ్యో సింహం ఏంటి ఇలా మోసపోయింది..

ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు సర్కులేట్ అవడం చూస్తూనే ఉంటాం.

ఇందుకు సంబంధించిన వీడియోలలో అనేక వీడియోలు ఫన్నీగా ఉంటే మరికొన్ని భయభ్రాంతులకు గురిచేసే వీడియోలు కూడా ఉంటాయి.

మరి కొన్ని జంతువులకు సంబంధించిన వైరల్ వీడియోలు కూడా మనం గమనిస్తూనే ఉంటాం.

ఇకపోతే తాజాగా ఓ సింహం చిన్నపిల్లలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే. """/" / కొన్నిసార్లు పులులు, సింహాలు పరాచకాలు ఆడుకుంటూ కొన్ని వీడియోలు చూడడానికి ఫన్నీగా ఉన్నా.

మరికొందరు వాటితో పరాచకాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో అనేకంగా మనం చూసే ఉన్నాము.

కాకపోతే ఈసారి అలా జరగకపోయినా ఇంచుమించు అలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఓ జంతు ప్రదర్శనశాలలో ఓ సింహం ఓ పిల్లాడిని వెంటాడి చంపేయాలన్న ప్రయత్నం చేసింది.

కాకపోతే ఆ సింహం కాస్త ఫూల్ అయింది.కొందరు పర్యటకులు జూలో ఉన్న సింహాన్ని చూసేందుకు వెళ్లగా ఆ సమయంలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది.

"""/" / సింహం కోసం ఏర్పాటు చేసిన ఎన్ క్లోజర్ లో అద్దం ముందు ఓ చిన్నారి నిలబడి ఉండగా దూరంగా ఉన్న సింహాన్ని ఆ బుడ్డోడు తిక్షనంగా వీక్షిస్తున్నాడు.

అయితే అదే సమయంలో ఆ చిన్నారిని గమనించిన సింహం ఆ పిల్లాడిని వేటాడేందుకు సిద్ధమైంది.

ముందుగా తాను వేటడానికి రెడీ అయినట్లు ఎలాంటి అనుమానం రాకుండా ముందుగా నేలపై కూర్చొని నక్కినక్కి చూస్తోంది.

అదే సమయంలో పిల్లాడు ఒకసారి వెనక్కి తిరిగి నిల్చునుగా వెంటనే ఆ సింహం పిల్లాడిపై అటాచ్ చేయడానికి ప్రయత్నించింది.

అయితే అక్కడ అద్దం ఉందన్న విషయం సింహం మరిచిపోయిందో ఏమో తెలియదు కానీ.

చివరికి ఫూల్ గా మారిపోయింది.క్షణం వ్యవధిలో పిల్లాడి ముందుకు సింహం ప్రత్యక్షం రావడంతో పిల్లాడు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.

అయితే ఆ సమయంలో ఈ సంఘటన చూసిన అక్కడివారు ఎంజాయ్ చేశారు.ఈ వీడియోని చూసిన రకరకాలుగా స్పందించారు.

ఇందులో కొందరైతే సింహాన్ని బుడ్డోడు భలే ఫూల్ చేశాడంటూ కామెంట్ చేస్తుండగా.మరికొందరైతే ఈ వీడియో చాలా ఫన్నీగా ఉన్నట్టు కామెంట్ చేస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు తీపికబురు.. వార్2 సినిమా నుంచి ఫస్ట్ లుక్ అప్పుడేనా?