ఆ ఇంటి పెరట్లో దూరిన సింహం.. అధికారులు రెక్కీ నిర్వహించి చూసి బిత్తరపోయారు!

అతడొక తోటమాలి.రోజూ పని చేసినట్టే తన యజమాని ఇంటి పెరడులో యేవో కలుపు మొక్కలు పీకుతున్నాడు.

ఆరోజు అతని యజమానులు కూడా పనిమీద బయటకు వెళ్లారు.అలా పని చేస్తుండగా గార్డెన్‌లోని మొక్కలకు నీళ్లు పోసే క్రమంలో ఏ మొక్కని వదలకుండా నీళ్లు పడుతున్నారు.

ఇంతలో సడెన్ గా ఓ మొక్కదగ్గర సమీపంలో చెట్ల మధ్య నక్కి ఉన్న సింహాన్ని చూసి భయాందోళనకు గురి అయ్యాడు.

వెంటనే అక్కడి నుంచి ఒక్క ఉదుటున పరుగెత్తుతూ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు ఫోన్ చేశాడు.

వెంటనే అలెర్టైన్ అధికారులు.సింహాన్ని బంధించేందుకు అవసరమైన సరంజామాతో అక్కడికి చేరుకున్నారు.

ఆ తోటమాలి చెప్పిన ఆనవాలును చూసుకొని ఎప్పుడు దొరుకుతుందా, పట్టుకుంటామా అనే ఉత్కంఠతతో ఆ స్థలాన్ని గాలిస్తున్నారు.

ఆ క్షణం రానే వచ్చింది.సరిగ్గా ఆ తోమాలి చెప్పిన స్థలంలోనే ఆ సింహం వుంది.

ఎక్కడికి కదలలేదు.అధికారులు కూడా ఒకింత భయంతోనే ముందుకు అడుగులు వేస్తున్నారు.

ఇక దానికి మూడింది, దొరికిపోయింది అనుకొనే లోపే ఓ వింత జరిగింది.అవును.

ఆ అధికారులు ఆ సింహంలో కదలికలు లేవని గ్రహించారు.దగ్గరకు వెళ్లగా.

అప్పుడు అసలు విషయం రివీలైంది.విషయం ఏమంటే, అది ఓ అందమైన, దట్టమైన షాపింగ్ బ్యాగ్.

"""/" /దాని మీదే ఓ సింహం బొమ్మ ఉంది.ఆ బ్యాగును ఆ ఇంటి యజమానులు ఎందుకోమరి చెట్ల మధ్య ఉంచి వెళ్లారు.

సంచిపై ఉన్న సింహం బొమ్మను చూసి.ఆ తోటమాలి నిజమైన సింహం అనుకోవడంతో.

ఈ తతంగం అంతా జరిగింది.ఇక ఈ ఘటన కెన్యాలోని 'కిన్యాయా' గ్రామంలో జరగగా తాజాగా వెలుగు చూసింది.

ఆ ఇంటి ఓనరే ఆ బ్యాగ్‌ను చెట్ల పొదల్లో పెట్టారట.ఆ సంచిలో మట్టివేసి అవకాడో మొక్కలను పెంచుతున్నారు.

ఎండలకు మొక్కలు వాడిపోకుండా ఉండేందుకు దాన్ని చెట్ల నీడలో ఉంచారు.ఇది అసలు సంగతి.

దాంతో అటవీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ మీద హరీష్ శంకర్ అలాంటి సీన్లు పెట్టడం కరెక్టేనా..?