మీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాతో మొబైల్ నంబర్‌ను ఇలా లింక్ చేసుకోండి!

మీరు స్టేట్ బ్యాంక్ కస్టమర్ అయితే మీరు ఖచ్చితంగా మీ మొబైల్ నంబర్( Mobile Number ) బ్యాంక్ ఖాతాకు లింక్ చేయవలసి ఉంటుంది.

లింక్ చేసేందుకు ఇతరుల సహాయం మీరు ఇపుడు తీసుకోవలసిన అవసరం లేదు.మీరు స్వయంగానే ఈ లింక్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.

ఒకవేళ మీరు అలా లింక్ చేసుకోనున్న యెడల అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఇలా చేయకుంటే మీరు మీ ఖాతాలో జరుగుతున్న లావాదేవీలను ( Transactions ) పర్యవేక్షించలేరు.

మీ స్మార్ట్ ఫోన్‌లో మీ స్టేట్ బ్యాంక్ ఖాతాకు( State Bank Account ) సంబంధించిన ప్రతి సమాచారం సందేశం ద్వారా కావాలంటే, మీరు త్వరగా ఫోన్ నంబర్‌ను బ్యాంక్ ఖాతాతో లింక్ చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.

"""/" / అవును, స్టేట్ బ్యాంక్ కస్టమర్‌లు అన్ని లావాదేవీలను పర్యవేక్షించడానికి సేవింగ్స్ బ్యాంక్ ఖాతాతో మొబైల్ నంబర్‌ను లింక్ చేయాల్సిందే అని సదరు బ్యాంక్ చెబుతోంది.

అందుకే మీ మొబైల్ ఫోన్ నంబర్‌ను SBI సేవింగ్స్ ఖాతాతో లింక్ చేయడం చాలా కీలకం.

దీనితో, మీరు ఖాతాకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని సందేశం ద్వారా పొందుతూనే ఉంటారు.

మొబైల్ నంబర్‌ను ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో ఇలా లింక్ చేసుకోవచ్చు.ముందుగా దీనికోసం మీరు యస్ బి ఐ కస్టమర్, అధికారిక వెబ్‌సైట్ కి లాగిన్ కావాలి.

ఆ తర్వాత చేంజ్ ప్రొఫైల్, పర్సనల్ డీటెయిల్స్, మొబైల్ నంబర్ పై క్లిక్ చేయాలి.

"""/" / తరువాత స్క్రీన్ ఎడమ ప్యానెల్‌లో కనిపించే నా ఖాతాలపై క్లిక్ చేసిన తరువాత ఖాతా నంబర్‌ను ఎంచుకుని, మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, సమర్పించుపై క్లిక్ చేస్తే సరిపోతుంది.

తరువాత నమోదిత మొబైల్ నంబర్, చివరి 2 అంకెలు మీకు అక్కడ కనబడతాయి.

మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో లింక్ గురించి అప్డేట్ మీకు తెలియజేయబడుతుంది.అదేవిధంగా యస్ బి ఐ బ్రాంచ్ కి వెళ్లి కూడా ఈ పని చేయొచ్చు.

దానికోసం సదరు బ్యాంకుకి వెళ్ళాక అక్కడ సంబంధిత దరఖాస్తు ఫారమ్ నింపవలసి ఉంటుంది.

దానికోసం అవసరమైన పత్రాలను సమర్పించండి.తరువాత మొత్తం ప్రాసెస్ అయ్యాక మీ మొబైల్ నంబర్‌కు SMS అందుకుంటారు.

Tillu Square Review : టిల్లు స్క్వేర్ రివ్యూ అండ్ రేటింగ్!