ఈత చెట్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారికి ఫిర్యాదు చేసిన గీత కార్మికులు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామ సమీపంలో ఉన్న ఈత చెట్లను మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన జక్కు భూమయ్య అనే వ్యక్తి జెసిబి యంత్రంతో సుమారు 20 ఈత చెట్లను తొలగించడంతో సింగారం గీత కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు, ఈత చెట్లే జీవనాధారంగా జీవిస్తున్న గీత కార్మికులు ఈత చెట్లను జెసిబి యంత్రం( JCB Machine)తో తొలగించడంతో గురువారం ఎక్సైజ్ అధికారికి( Excise Officer ) ఫిర్యాదు చేశారు.
ఈత చెట్లు( Phoenix Sylvestris ) తొలగించిన వ్యక్తి పై వెంటనే చర్యలు తీసుకోవాలని గీత కార్మికులు ఫిర్యాదు చేశారు, ఈ సందర్భంగా గీత కార్మికులు మాట్లాడుతూ తమకు జీవనాధారమైన ఈత చెట్లను తొలగించి తమ పొట్టలు కొడుతున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు, ఫిర్యాదు చేసిన వారిలో సింగారం గౌడ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
విదేశాల్లో ఉంటేనే అసలైన భారతీయులవుతారా.. ప్రవాస భారతీయురాలి పోస్ట్ వైరల్!