హుజూర్ నగర్ మెయిన్ రోడ్ పనులకు లైన్ క్లియర్…!

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మెయిన్ రోడ్ అభివృద్ధి పనులకు లైన్ క్లియరైంది.

గత ప్రభుత్వంలో హుజూర్ నగర్,నేరేడుచర్ల మున్సిపాలిటీలో సిసి నిర్మాణంతో పాటు పైప్ లైన్ నిర్మాణానికి మొదట వేసిన అంచనాకు రెట్టింపు అంచనా వేసి పనులు చేపట్టటానికి అధికార పార్టీ పాలకపక్షం ప్రయత్నించడంతో విపక్ష కాంగ్రెస్ సభ్యులు రోడ్డు పనుల్లో అవినీతి చోటుచేసుకుందని 2020 -21లో గత నాలుగేళ్ళ క్రితం కోర్టులో కేసు వేశారు.

దీని మూలంగా మెయిన్ రోడ్ కు ఒకవైపు మాత్రమే సిమెంట్ రోడ్డు పనులు పూర్తికాగా మరోవైపు రోడ్డు నిర్మాణ పనులతో పాటు మంచినీటి పైపులైన్ల నిర్మాణం కూడా నిలిచిపోయిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు పాలకపక్షం, విపక్షం ఏకమైనందున మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) ఆదేశం మేరకు కోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకున్నారు.

ఫిర్యాదుదారులు కేసును ఉపసంహరించుకున్నారని కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో మెయిన్ రోడ్ సీసీ పనులు ప్రారంభం కానున్నాయి.

రోడ్డు మరియు పైపులైన్ నిర్మాణానికి నిధులు సిద్ధంగా ఉన్నాయని, వెంటనే పనులు పూర్తిచేసి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పట్టణాల ప్రజలు కోరుతున్నారు.

అమరావతిపై కీలక నిర్ణయం.. శ్వేతపత్రం విడుదల