పని చేసే వాళ్లకు రాళ్ల దెబ్బలా.?: నారా లోకేశ్ కామెంట్స్

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఘటనలో టీడీపీ నేత నారా లోకేశ్ సహా పలువురిపై పోలీస్ కేసులు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో నారా లోకేశ్ మాట్లాడుతూ.ప్రజల తరపున పోరాటం చేస్తున్నందుకు కేసులు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు.

పని చేసే వాళ్లకు రాళ్ల దెబ్బలా అంటూ లోకేశ్ మండిపడ్డారు.తనపై 16 కేసులున్నాయని, వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా తమపై అక్రమ కేసులు బనాయిస్తుందని ఆయన ఆరోపించారు.

కాగా నిన్న బంగారుపాళ్యంలో పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య జరిగిన తోపులాట తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable