ముందు ముందు చాలా ‘ఫైల్స్’ సినిమాలు రాబోతున్నాయా?
TeluguStop.com
ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ ప్రస్తుతం వివాదాస్పద సినిమాల వైపు ఆకర్షితులు అవుతున్నారు.భారీ బడ్జెట్ లేదా వివాదాస్పద సినిమాలను తీస్తేనే జనాలు ఎక్కువగా ఆధరించే అవకాశాలు ఉన్నాయి అని భావిస్తున్నారు.
అందుకే ఎక్కువ శాతం ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు.సక్సెస్ అయిన సినిమాల్లో వివాస్పద సినిమాలు ఉన్నాయి అనే విషయం తెల్సిందే.
"""/" /
కొన్ని సినిమాలు బాక్సాఫీస్( Box Office ) వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి అంటే కారణం కచ్చితంగా వివాదాలు అనడంలో సందేహం లేదు.
తాజాగా వచ్చిన ది కేరళ స్టోరీ( The Kerala Story ) సినిమా భారీ వసూళ్లు సొంతం చేసుకున్నాయి.
కనుక చాలా మంది కూడా అలాంటి వివాదాస్పద సినిమాలను చేసేందుకు ఆసక్తి కనబర్చుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను దక్కించుకోవాలి అంటే ఏదో ఒక వివాదం ఉండాలని భావిస్తున్నారు.
అందుకే ది కశ్మీర్ ఫైల్స్( The Kashmir Files ) వంటి సినిమాలు చాలానే వస్తున్నాయి.
"""/" /
గత ఏడాది సంచలనం సృష్టించిన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా యొక్క కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అందుకే ఆ సినిమా తరహాలో ప్రస్తుతం ఢిల్లీ ఫైల్స్ ( Delhi Files )అనే సినిమా రాబోతుంది.
అంతే కాకుండా ఇంకా చాలా ఫైల్స్ ను కూడా రూపొందించేందుకు గాను స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.
అదుగో ఇదుగో అంటూ భారీ ఎత్తున ప్రకటనలు వస్తూనే ఉన్నాయి.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ ఫైల్స్ ను కూడా రూపొందించే అవకాశాలు ఉన్నాయట.
రాజకీయంగా వినియోగించుకునేందుకు కొందరు ఈ సినిమాలను తీసుకు వస్తున్నారు.అంతే కాకుండా వివాదాల కారణంగా మంచి కలెక్షన్స్ కూడా వస్తున్నాయి.
ముందు ముందు ఈ ఫైల్స్ సినిమాల వల్ల బాక్సాఫీస్ కలకలలాడటం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వసూళ్లు వచ్చినా రాకున్నా కూడా రాజకీయ ప్రయోజనం కలుగుతుంది అనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ పై విమర్శలు… యూటర్న్ తీసుకున్న కౌశిక్ తల్లి.. ఏం జరిగిందంటే?