ఆంజనేయ స్వామి దేవాలయంలో దీపం.. ఇలా వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ దూరం..!
TeluguStop.com
ముఖ్యంగా చెప్పాలంటే ఆంజనేయ స్వామిని( Anjaneya Swamy ) ఎంతో మంది ప్రజలు భక్తితో పూజిస్తూ ఉంటారు.
అలాగే దాదాపు ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం కచ్చితంగా ఉంటుంది.ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఎన్నో కష్టనష్టాలు దూరమవుతాయని పండితులు చెబుతున్నారు.
అలాగే తమ కోరుకున్న కరికలు అన్నీ నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.అలాగే ఆంజనేయ స్వామికి ఎక్కువగా ఇష్టమైన రోజు మంగళవారం( Tuesday ) అని ఆ రోజున స్వామిని పూజిస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుందని భక్తులను నమ్ముతారు.
అయితే మరి కొంత మంది ప్రజలు శనివారం రోజున ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటారు.
"""/" /
అలాగే ఆంజనేయ స్వామిని భక్తితో కొలిస్తే ఎలాంటి బాధలు ఉండవని చాలా మంది పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉండే రావి చెట్టుకి( Peepal Tree ) 11 సార్లు ప్రదక్షిణలు చేసి "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనీ స్మరించడం వల్ల మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే 41 రోజుల పాటు రాగి చెట్టు చుట్టూ తిరుగుతూ ఆర్థిక సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
ముందుగా ఆంజనేయ స్వామి దగ్గర దీపాన్ని వెలిగించి రావి ఆకుల పై పిండితో తయారు చేసిన దీపాల కుంకుమలతో అలంకరించి వెలిగించాలి.
"""/" /
అలాగే దీపాలను వెలిగించేటప్పుడు కాస్త బెల్లం వేసి వెలిగించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
అలాగే ఇంట్లో మనస్పర్దాలు లేకుండా ఉండాలంటే రామ భజన( Ram Bhajan ) చేస్తూ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచడం వల్ల మనస్పర్దాలు తొలగిపోతాయి.
అయితే పూజ చేస్తున్నన్ని రోజులు తల్లిదండ్రులు, అలాగే గోమాత ప్రదర్శన చేయడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
అలాగే ఏవైనా మగ జీవులకు భోజనం పెట్టినా కూడా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.