లైగర్ బ్రహ్మీ ట్రైలర్.. హీరోయిన్ ఇలియానా కూడా ఉందిగా.. మీరు చూశారా?!

ఈమధ్య సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉనప్పటి నుంచి మీమర్స్ ఎప్పుడెప్పుడు ఎవర్ని ట్రోల్ చేద్దామా అని ఎదురు చూస్తుంటారు.

ముఖ్యంగా సెలబ్రెటీలను మాత్రం అస్సలు వదలరు.హీరో హీరోయిన్ ల మధ్య ఏదైనా తేడా కనిపిస్తే చాలు వెంటనే ట్రోల్ చేసేస్తారు.

అలా ఇప్పటికీ చాలా మంది హీరో హీరోయిన్ లను బాగా ట్రోల్స్ చేసారు.

పైగా కొన్నిసార్లు కమెడియన్లను కూడా మధ్యలోకి లాగుతూ ఉంటారు.చాలా వరకు మీమ్స్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి.

ముఖ్యంగా తెలుగు సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ను మీమ్స్ లలో పెట్టి బాగా సందడి చేస్తున్నారు.

నిజానికి బ్రహ్మానందం ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే.దీంతో ప్రతి ఒక్క మీమ్స్ లో బ్రహ్మానందంను పెడుతుంటారు మీమర్స్.

అలా తాజాగా బ్రహ్మానందంను ఏకంగా లైగర్ ట్రైలర్ తోనే చూపించారు మీమర్స్.తెలుగు సినీ ఇండస్ట్రీలో గొప్ప హాస్య నటుడుగా పేరు సంపాదించుకున్న నటుడు బ్రహ్మానందం.

ఈయన గురించి తెలియని వారెవ్వరూ లేరు.ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించి బెస్ట్ కమెడియన్ గా నిలిచాడు.

తన నటనకు ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు.ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు.

నిజానికి ఈయన కామెడీ అంటే పడి చచ్చిపోతారు ప్రేక్షకులు. """/"/ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు ప్రేక్షకులకు టచ్ లో ఉంటాడు.

ఇక ఈయన తొలిసారిగా 1987లో ఇండస్ట్రీకి అడుగుపెట్టి విశ్రాంతి లేకుండా ఇప్పటి వరకు నటిస్తూనే ఉన్నాడు.

ఏ స్టార్ హీరో కూడా చూపించని నవరసాలను చూపించే శక్తి ఆయనలో ఉంది.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అనుకరించకపోవడంతో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నాడు.గతంలో ఓషోలో పాల్గొని ఇక తనకు అనారోగ్యం సమస్య ఉండటం వల్ల విశ్రాంతి తీసుకోవడం కోసం ఎక్కువగా నటించడం లేదని తెలిపాడు.

వచ్చిన అవకాశాలను వదులుకున్నానని తెలిపాడు.ఆ తర్వాత ఒక సినిమాలో నటించి ప్రేక్షకులను మరోసారి నవ్వించాడు.

కానీ అప్పటిలాగా వరుస సినిమాలలో అంతగా నటించలేకపోతున్నాడు.కానీ సోషల్ మీడియా మీమ్స్ ద్వారా ఎప్పుడు తెలుగు ప్రేక్షకులకు టచ్ లోనే ఉంటున్నాడు.

నిజానికి బ్రహ్మానందం సోషల్ మీడియాలో చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తాడు.కానీ ఆయన ద్వారా వచ్చే మీమ్స్ మాత్రమే మనల్ని బాగా నవ్విస్తుంటాయి.

ఇదంతా పక్కన పెడితే ఇటీవలె లైగర్ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే.ఇక ఆ ట్రైలర్ ను మన మీమర్స్ మన బ్రహ్మీ ని పెట్టి ఎడిట్ చేశారు.

ఆయన నటించిన సినిమాలల్లో ఆ ట్రైలర్ కు సెట్ అయ్యే సన్నివేశాలని తీసుకొని బాగా ఎడిట్ చేశారు.

ఓ సినిమాలో ఇలియానాను బైకుపై ఎక్కించుకొని ఉన్న సన్నివేశాన్ని కూడా పెట్టగా ఆయనకి హీరోయిన్ గా ఇలియానా అని చూపించారు మీమర్స్.

ఇక ఆ ట్రైలర్ ని చూసి నెటిజన్లు తెగ నవ్వుకోవడం తో పాటు అద్భుతంగా ఎడిట్ చేశారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

శంషాబాద్ ఎయిర్‎పోర్టు వద్ద ఆపరేషన్ చిరుత సక్సెస్..!