న్యూ లుక్ లోకి మారిపోయిన లైగర్ టీమ్.. అప్పుడే పాన్ ఇండియా ప్రొమోషన్స్ స్టార్ట్ చేసేసారుగా..
TeluguStop.com
లైగర్ టీమ్ అనుకోకుండా కనిపించి సర్ప్రైజ్ ఇచ్చింది.బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో టీమ్ అంతా సందడి చేసింది.
సడెన్ గా అలా మీడియా ముందుకు దర్శనం ఇవ్వడంతో అందరు వారిని చూసి సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు.
హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత ఛార్మి, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలిసి ఒకే డ్రెస్ కోడ్ లో కనిపించారు.
వీరి లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ప్రెసెంట్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొదటి సినిమా 'లైగర్'.
ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.
ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో వీరు ముంబై లో హంగామా చేసారు.
అక్కడ టీమ్ అంతా కలిసి ఒకే డ్రెస్ కోడ్ వేసుకుని మీడియా ముందుకు వచ్చారు.
ఇక ముంబై మీడియా విజయ్ ను చూసిన వెంటనే సర్ సర్ అంటూ వెంటపడి మరీ ఫోటోలు, వీడియోలు తీశారు.
"""/" /
విజయ్ బ్లాక్ టక్స్ వేసుకుని చాలా అందంగా కనిపించాడు.వీరంతా అపూర్వ మెహతా బర్త్ డే వేడుకలకు హాజరయ్యారు.
ఈ వేడుకలో పాల్గొన్న ఇతడి మీదనే అందరి కళ్ళు నిలిచాయి.ఇతడు చాలా స్టైలిష్ సూట్ లో ఎంట్రీ ఇచ్చి అభిమానుల హృదయాలను దోచుకున్నాడు.
అలాగే పూరీ, ఛార్మి కూడా బ్లాక్ లో అదరగొట్టారు.లైగర్ సినిమాను ఆగస్టు 25న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
దీని తర్వాత పూరీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన సినిమాను కూడా మళ్ళీ విజయ్ తోనే తీయాలని ఫిక్స్ అయ్యాడు.
ఈ సినిమా కూడా త్వరగానే సెట్స్ మీదకు వెళ్లనుంది.
పాన్ వరల్డ్ లో సందీప్ రెడ్డి వంగ సినిమాలు ఆడుతాయా..?