లైగర్ బాబుకి ఐటం పాప ఎవరు..?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో లైగర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది.పూరీ కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేశారు.

బాక్సింగ్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచింది.

విజయ్ దేవరకొండకి నేషనల్ లెవల్ లో ఇమేజ్ తెచ్చేలా ఈ సినిమా వస్తుంది.

ఇక ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా ఉన్నా స్పెషల్ ఎట్రాక్షన్ కోసం మరో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట ఆ సాంగ్ లో బాలీవుడ్ భామతో అదిరిపోయే మాస్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట.

పూరీ సినిమాల్లో ఐటం సాంగ్స్ కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది.ఈ క్రమంలో లైగర్ సినిమాలో కూడా ఈ ప్రత్యేక గీతానికి ప్రాముఖ్యత ఉండే ఛాన్స్ ఉంటుంది.

అయితే ఈ సాంగ్ లో ఎవరు చేస్తారన్నది మాత్రం తెలియాల్సి ఉంది.లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు.

సినిమాలో బాక్సింగ్ స్టార్ మైక్ టైసన్ కూడా నటిస్తున్నాడు.

గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్.. ఇంతకీ ఆ ఫీచర్ ఏమిటంటే..?