పూరి తెలుగు లో సినిమాలు చేయడం కష్టం.. వారంతా కూడా బ్యాన్‌

ఈ మధ్య కాలంలో పూరి జగన్నాథ్ వార్తల్లో తెగ నిలుస్తున్నాడు.గతం లో ఆయన సినిమా లతో వార్తలో నిలిచే వాడు.

కానీ ఇప్పుడు ఆయన వ్యవహార శైలి మరియు ఆయన పై కొందరు చేస్తున్న విమర్శల కారణంగా వార్తల్లో నిలుస్తున్నాడు.

విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందించిన లైగర్ సినిమా దారుణమైన పరాజయం మూట కటుకుంది.

ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ల ను నిలువునా ముంచేసింది.అంతే కాకుండా ఫైనాన్షియర్ భారీ ఎత్తున నష్టాలను చవి చూడాల్సి వచ్చిందట.

ఆ నష్టాలకు సంబంధించి కొంత మేరైనా నష్ట పరిహారం చెల్లించాలంటూ దర్శకుడు పూరి జగన్నాథ్ ని డిస్ట్రిబ్యూటర్లు మరియు ఫైనాన్షియర్స్ డిమాండ్ చేస్తున్నారు.

కానీ దర్శకుడు పూరి జగన్నాథ్ మాత్రం ఇప్పటికే తాను ఒక్క రూపాయి చెల్లించేది లేదు అంటూ తెగేసి చెప్పాడు.

తనను బెదిరిస్తున్నారంటూ దర్శకుడు పూరి జగన్నాథ్ పోలీస్ కేసు కూడా నమోదు చేయడం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది.

డబ్బులు తిరిగి చెల్లించాలంటూ అడిగితే పోలీస్ కేసు పెట్టిన దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాలను పూర్తిగా బ్యాన్ చేయాలని ఫైనాన్స్ ఇయర్స్ నిర్ణయానికి వచ్చారు.

"""/"/ ఇక నుండి పూరి జగన్నాథ్ దర్శకత్వం లో నిర్మాణం జరగబోతున్న ఏ ఒక్క సినిమా కు కూడా తాము ఫైనాన్స్ చేయమని అలాగే డిస్ట్రిబ్యూట్ చేయమంటూ కొందరు నిర్ణయానికి వచ్చారు.

దాంతో విజయ్ దేవరకొండ తో తీయాలనుకున్న జనగణమన సినిమా తో పాటు ఇంకా చాలా సినిమాలు కూడా ఇబ్బందుల్లో పడ్డట్లు అయ్యాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న పూరి జగన్నాథ్ కి ఈ బ్యాన్‌ కచ్చితంగా మరింత నష్టంను మిగుల్చుతుంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం చేస్తున్నారు.

వైరల్: అదిరిపోయిన షారుఖ్, ఐశ్వర్య రాయ్ పిల్లల స్టేజ్ షో!