విమాన టికెట్ ధరలపై పరిమితులు ఎత్తివేత
TeluguStop.com
దేశీయ మార్గాల్లో విమాన టికెట్ ధరలపై పరిమితులను ఎత్తివేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
దీంతో ఇకపై ప్రయాణికుల ఛార్జీలను విమానయాన సంస్థలే నిర్ణయం తీసుకోనున్నాయి.ఆగస్ట్ 31 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
విమాన ఇంధన ధరలు, రోజువారీ ప్రయాణికుల డిమాండ్ వంటి అంశాలను విశ్లేషించిన అనంతరం ఛార్జీలపై పరిమితులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
పౌర విమానయాన రంగంలో స్థిరీకరణ మొదలైందని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధిని సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కరోనా, లాక్ డౌన్ తర్వాత 2020 మే నెలలో దేశీయ విమాన సేవలు తిరిగి ప్రారంభమైనప్పుడు.
దేశీయ మార్గాల్లో ఛార్జీలపై కనిష్ట, గరిష్ట పరిమితులను విధించిన విషయం తెలిసిందే.తక్కువ ఛార్జీల వలన విమానయాన సంస్థలు నష్టపోకుండా, ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రయాణ సమాయాన్ని బట్టి ధరలను నిర్ణయించారు.
చైనా పరువు గంగపాలు.. ఈ వీడియో చూస్తే డ్రాగన్ కంట్రీపై అభిప్రాయం మారిపోతుంది!