లిఫ్టు సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి:రైతు సంఘం నేత బెల్లంకొండ

సూర్యాపేట జిల్లా:1996 నుండి నేటి వరకు లిఫ్టు ఇరిగేషన్ పథకం( Lift Irrigation Scheme )లో పనిచేస్తున్న సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రైతు సంఘం సూర్యాపేట జిల్లా సహయ కారదర్శి బెల్లంకొండ సత్యనారాయణ ( Bellamkonda Satyanarayana )రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy )ని కోరారు.

సోమవారం నడిగూడెం మండల కేంద్రంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువల ఎత్తిపోతల యూనియన్ గౌరవ అధ్యక్షుడు పందిరి శ్రీనివాస్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి కొరట్ల ప్రసాద్( Nagarjunasagar ) తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదివారం హైదరాబాదులో మంత్రి లిఫ్ట్ ల మీద సమీక్ష సమావేశం నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

లిఫ్టులలో సుమారుగా గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు ఉన్నా లేకున్నా లిఫ్ట్ నిర్వహణ బాధ్యతలు చేపడుతున్నారని, అలాంటి సిబ్బందిని అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి తర్ఫీదు ఇవ్వాలని కోరారు.

తలస్నానం చేసేటప్పుడు ఈ సింపుల్ ట్రిక్ ను పాటిస్తే మీ జుట్టు సిల్కీగా, షైనీగా మెరిసిపోవడం ఖాయం!