నాకు ప్రాణ హాని ఉంది...తుపాకీ కావాలి అని అడిగిన ధోని భార్య సాక్షి.! అసలేమైంది?

తనకు ప్రాణహాని ఉందని గన్‌ లైసెన్స్ ఇవ్వాలని క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని సతీమణి సాక్షి కోరారు.

ఈ మేరకు ఆమె పోలీసు అధికారులకు గన్ లైసెన్స్ కోసం వినతిపత్రం సమర్పించారు.

"క్రికెట్‌ మ్యాచ్‌ల దృష్ట్యా ధోని ఇంట్లో ఉండే సమయం చాలా తక్కువ.నా కూతురితో కలిసి నేను మాత్రమే ఇంట్లో ఒంటరిగా ఉంటున్నా.

ఏదైనా పని కోసం బయటకు వెళ్లాల్సి వచ్చినా ఒక్కదాన్నే వెళ్లాలి.నా భద్రతను దృష్టిలో పెట్టుకునే నాకు లైసెన్స్‌డ్‌ తుపాకీ లేదా రివాల్వర్‌ ఇప్పించాలి' అని సాక్షి కోరింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 20006లో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని కూడ తుపాకీ లైసెన్స్ కోసం ధరఖాస్తు చేసుకొన్నాడు.

అయితే అతడికి 9 ఎంఎఎం గన్ ను అనుమతిచ్చింది.ప్రస్తుతం క్రికెటర్ ధోని ఐర్లాండ్ పర్యటనకు వెళ్ళనున్నారు.

యోయో టెస్టులో ధోని ఫాసయ్యారు.బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ సెషన్స్‌లో ధోని పాల్గొంటున్నారు.

జూన్ 27, 29 తేదీల్లో ఐర్లాండ్‌తో టీమిండియా రెండు టీ20 మ్యాచ్లు ఆడనుంది.

ఆ తర్వాత జులై 3 నుంచి ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరనుంది.ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, ఐదు టెస్టుల మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి13, సోమవారం 2025