ప్రతి గ్రామంలో గ్రంథాలయాలు నిర్మించాలి:ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

సూర్యాపేట జిల్లా:పూలే- అంబేద్కర్ నాలెడ్జి (సెంటర్స్) గ్రంథాలయాలు ప్రతి గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్ గ్రామంలో మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో విజ్ఞానాన్ని పెంచే గ్రంథాలయాలు సమాజానికి అవసరమన్నారు.

కాబట్టి గ్రంథాలయ సాంప్రదాయం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మనం ఫౌండేషన్ అధ్యక్షుడు గంపల కృపాకర్,దండ వెంకటరెడ్డి, అద్దంకి జానమ్మ,వేల్పుల వెంకన్న,గంపల నారాయణ, పురం జాన్, గరిగంటి రజిత, ముత్తయ్య,అజయ్,పురం సైదులు తదితరులు పాల్గొన్నారు.

మూసీ యుద్ధం..  రేవంత్ వర్సెస్ ఈటెల