బ్యాంకు డిపాజిట్ ఫారంలో తులారాశి.. ఇదేందయ్యా అసలు..

సోషల్ మీడియాలో అనేక విచిత్రాలు వైరల్ అవుతూ ఉంటాయి.పరీక్ష పేపర్లలో కొంతమంది వినూత్నంగా రాయడం వంటివి వైరల్ గా మారుతూ ఉంటాయి.

ఇప్పుడు అలాగే ఒక పేపర్ వైరల్ గా మారింది.చాలామంది బ్యాంకులకు వెళ్లి డబ్బులు డిపాజిట్ చేస్తూ ఉంటారు.

ఇలాంటి సమయంలో ఖచ్చితంగా డిపాజిట్ ఫారంను పూర్తి చేయాల్సి ఉంటుంది.బ్యాంకు శాఖలో లభించే డిపాజిట్ ఫారంను పూర్తి చేసి కౌంటర్ సిబ్బందికి ఇస్తే డబ్బులు డిపాజిట్ చేస్తారు.

మీ పేరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తో పాటు మీరు ఎంత డబ్బులు డిపాజిట్ చేస్తున్నారనే వివరాలు రాయాల్సి ఉంటుంది.

"""/" / అయితే అలాంటి బ్యాంకు డిపాజిట్ ఫారం ( Bank Deposit Form )ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది.

కొంతమంది నిరుద్యోగులకు బ్యాంకు డిపాజిట్ ఫారం ఎలా పూర్తి చేయాలో తెలియదు.అలాంటివారు తెలిసినవారితో పూర్తి చేయించుకుంటూ ఉంటారు.

కొంతమంది తెలియక ఏది పడితే అది రాస్తూ ఉంటారు.తాజాగా అలాంటి డిపాజిట్ ఫారం ఒకటి వైరల్ గా మారింది.

ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్( Moradabad In Uttar Pradesh ) లో ఇండియన్ బ్యాంక్ ( Indian Bank )లో డబ్బులు డిపాజిట్ చేయడానికి ఒక వ్యక్తి వెళ్లాడు.

అక్కడికి వెళ్లిన తర్వాత డిపాజిట్ ఫారం తీసుకుని కంప్లీట్ చేశాడు. """/" / అయితే డిపాజిట్ ఫారంలో తప్పు రాశాడు.

హిందీలో డిపాజిట్ అంటే రాశి అని అర్ధం.అయితే సదరు కస్టమర్ రాశి అని ఉన్నచోట్ల తులారాశి( Libra ) అని రాశాడు.

రాశి అని చూడగానే తన జన్మరాశి అనుకుని తులారాశి అని రాశాడు.హిందీలో రాశి అంటే ఇంగ్లీష్ లో డిపాజిట్ అనే విషయం అతడికి తెలియకపోవడంతో ఇలా చేశాడు.

దీంతో ఈ డిపాజిట్ ఫారం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

ఇది చూసి అందరూ నవ్వుకుంటున్నారు.