బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం.. గెస్ట్ ఆఫ్ హానర్ గా కేసీఆర్..!
TeluguStop.com
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా, అధికారికంగా నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది.ఈ మేరకు చేయాల్సిన ఏర్పాట్లపై దృష్టి సారించింది.
దీనిలో భాగంగా తెలంగాణ, మహారాష్ట్రతో పాటు కర్ణాటక సీఎంలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు.
సెప్టెంబర్ 17న హైదరాబాద్ లో జరిగే కార్యక్రమంతో పాటు ఏడాది పాటు జరిగే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ విమోచన దినోత్సవ ప్రారంభ కార్యక్రమం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరగనుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరుకానున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.
అదేవిధంగా గెస్ట్ ఆఫ్ హానర్ గా కేసీఆర్ హాజరుకావాలని కోరారు.
కొత్త ఆఫర్లకు నో చెబుతున్న ప్రభాస్ బ్యూటీ.. ప్రభాస్ వల్లే ఈ సమస్య ఎదురైందా?