LG 4K ప్రొజెక్టర్ మైమరిపించే డిజైన్, స్పెసిఫికేషన్లు ఇవే..!
TeluguStop.com
LG కంపెనీ ( LG Company )CES 2024 కొసం LG 4K ప్రొజెక్టర్ ను అద్భుతమైన డిజైన్ తో మార్కెట్లోకి విడుదల చేయనుంది.
ఈ ప్రొజెక్టర్ RGB లేజర్ లైట్ సోర్స్ తో వస్తుంది.120 అంగుళాల వరకు సైజుతో 4K UHD (3840*2160 పిక్సెల్ లు) రిజల్యూషన్ చిత్రాలను ప్రాజెక్టు చేయగలదు.
స్టైలిష్ ఇంటీరియర్ యాక్సెసరీ గా కంటిని ఆకట్టుకునే మిని మలిస్ట్ డిజైన్ తో రానుంది.
360-డిగ్రీల రోటేటబుల్ హ్యాండిల్ తో వస్తుంది.1.
49 కేజీల బరువును కలిగి ఉండి EARC/USB టైప్ C ఇన్ పుట్ లతో HDMI పోర్ట్ లతో వస్తుంది.
ఈ ప్రొజెక్టర్ గరిష్టంగా 500 ANSI ల్యూమెన్ ల వరకు ప్రకాశవంతంగా పనిచేయగలదు.
"""/" /
ఈ ప్రొజెక్టర్( LG 4K Projector ) స్పష్టమైన, పదునైన చిత్రాలను అందించడంతో పాటు గొప్ప రంగులు, లోతైన నలుపు రంగులు ప్రతి సన్నివేశానికి లోతు మరియు చైతన్యాన్ని జోడించగలదు.
ఈ ప్రొజెక్టర్ Cine Beam Qube LG Web OS 6.0 తో పని చేస్తుంది.
ఈ ప్రొజెక్టర్ నెట్ఫ్లిక్స్, డిస్నీ+ హాట్ స్టార్, ప్రైమ్ వీడియో, లాంటి విభిన్న ఎంపిక స్ట్రీమింగ్ సేవలకు స్పష్టమైన నియంత్రణ మరియు సులభమైన యాక్సెస్ ను కూడా అందిస్తుంది.
"""/" /
జనవరి 9-12వ తేదీ CES 2024 ఈవెంట్ లో ఈ కొత్త LG 4K ప్రొజెక్టర్ సినీ బీమ్ క్యూబ్( Cine Beam Qube ) ను ప్రదర్శించడానికి కంపెనీ సిద్ధంగా ఉంది.
అప్పుడే ఈ ప్రొజెక్టర్ ధర ప్రకటించే అవకాశం ఉంది.పెద్ద, చిన్న గదులలో ఈ ప్రొజెక్టర్ చాలా బాగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.
వినియోగదారులు చూసే అన్ని లక్షణాలను కలిగి ఉండే ఒక ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ ప్రొజెక్టర్ ఇది.
అద్భుతమైన డిజైన్ తో మార్కెట్లో అడుగుపెట్టనుంది.ఈ క్యూబ్ ని ప్రీమియం ప్రొజెక్టర్ గా వర్ణించబడింది.
ఓరి దేవుడా.. 8 కేజీల బిర్యానీ ఎలా తినేశావేంటి సామీ! వీడియో వైరల్