మే 1న ఇంటింటికీ పెన్షన్లు ఇచ్చేలా చూడాలని చంద్రబాబు లేఖ..!!
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.దీంతో ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఇదిలా ఉంటే ఏప్రిల్ మొదటి తారీకు.పెన్షన్ పంపిణీ విషయంలో ఏపీలో విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
వాలంటీర్లు( Volunteers ) .పెన్షన్ పంపిణీ చేయకూడదని ఈసీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది.
దీంతో ఆ సమయంలో పెన్షన్ దారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఇదిలా ఉంటే మళ్లీ మొదటి తారీకు వస్తూ ఉండటంతో ఏపీలో పెన్షన్ల పంపిణీపై టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandrababu ) కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
"""/" /
మే 1న ఇంటింటికీ పెన్షన్లు ఇచ్చేలా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.
గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా చూడాలని, గ్రామస్థాయి ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వాలని పేర్కొన్నారు.
ఇంటింటికీ వెళ్లి పెన్షన్ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.బుధవారం చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నెల్లిమర్ల, విజయనగరం నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఏపీలో సీఎం జగన్ ఐదేళ్ల పాలనపై చంద్రబాబు తనదైన శైలిలో విమర్శలు చేశారు.
రాష్ట్రానికి కనీసం ఒక పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయారని అన్నారు.ఇదే సమయంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే.
ప్రజలకు చేసే మంచి పనులను తెలియజేస్తున్నారు.రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఈ ఎన్నికలలో కూటమి పార్టీకి ఓటేయాలని పిలుపునిస్తున్నారు.
వీడియో: పురిటి నొప్పుల్లో ఉన్న జీబ్రాపై మగ జీబ్రా అరాచకం.. కళ్లముందే బిడ్డను చంపేసింది!