నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జరుగుతున్న వరుస ఘటనలు జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, వెంటనే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి బుధవారం జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరికి లేఖ రాశారు.
ఆ లేఖలో ఈ మధ్య కాలంలో ఆసుపత్రిలో జరుగుతున్న సంఘటనలను ఎస్పీకి గుర్తు చేస్తూ నల్లగొండ ప్రభుత్వ దవాఖానలో పేషెంట్ సహాయకురాలిపై అందులో పనిచేస్తున్న సూపర్వైజర్,ఐసీయూలో ఉన్న మరొక పేషెంట్ పై కూడా సిబ్బంది అత్యాచారయత్నానికి ప్రయత్నించారని తెలుస్తుంది.
ఈ ఘటనలు అత్యంత దారుణం,అమానుషం.ఇటీవల ప్రభుత్వ దవాఖానలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే రోగులు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉన్నది.
ధవఖానలో రక్షణ కరువైంది.ఆసుపత్రిలో సిబ్బంది,బాధ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
పసిపాపను సైతం కుక్కలు కరిచి తెచ్చిన సంఘటన చూశాము.ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతున్నది.
ఘటనలపై సమగ్ర విచారణ జరిపి వారిపైన చట్టరీత్యా కఠిన తీసుకోవాలని,భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఎస్పీని కోరారు.
ఇంతకంటే దిగజారి పోవద్దు… డైరెక్టర్ గీతా కృష్ణకు కౌంటర్ ఇచ్చిన కోటి!