మట్టి వినాయకులను పూజించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District) ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూర్ గ్రామంలోలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మట్టి వినాయకులను పూజించాలని పర్యావరణాన్ని కాపాడాలని, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.

కృత్రిమ రంగులతో( Artificial Colors ) తయారైనా వినాయక విగ్రహాల వలన పర్యావరణం, నీటి కాలుష్యం ఏర్పడుతుందని నీటిలో నివసించే జలాచరాలకు ప్రమాదామని విద్యార్థులకు తెలియజేస్తూ గ్రామ ప్రజలకు అవగాహనా కల్పిస్తు, కృత్రిమ రంగులను నిషేదిస్తూ, సహజ రంగులను వాడాలని విద్యార్థులు నినదించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

బిగ్ బాస్ హోస్ట్ గా విజయ్ సేతుపతి రెమ్యూనరేషన్ ఎంతంటే.. కమల్ హాసన్ కంటే ఎక్కువేనా?