తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకుందాం కేకే మహేందర్ రెడ్డి
TeluguStop.com
దమ్మన్నపేట గ్రామ రైతులు యువకులు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరిక రాజన్న సిరిసిల్ల జిల్లా శుక్రవారం రోజున గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో మండల అధ్యక్షుడు హమీద్ గ్రామ శాఖ అధ్యక్షులు బలరాం రెడ్డి ( Balaram Reddy ) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దమ్మన్నపేట గ్రామ రైతులు యువకులు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వారికి కండువా కప్పి కేకే మహేందర్ రెడ్డి గారు స్వాగతం పలికారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు కే బాల్ రెడ్డి, ఏ కిషన్ డి రాజిరెడ్డి, అవునూరి దేవయ్య, బి మురళి రెడ్డి, డి సాయి రెడ్డి, ఈ నారాయణ,వి సాయిరెడ్డి, భూమక్క పద్మా రెడ్డి, దుంపల రాంరెడ్డి, పాప గారి రామ్ రెడ్డి, బసిరెడ్డి ఎల్లారెడ్డి, బసిరెడ్డి మధు, అక్కల చంద్ర గౌడ్, బద్దిపడగ బాల్రెడ్డి జనగామ బాబు, వంగలి సాయిలు, చెరుకు ఎల్లయ్య, దొబ్బ దుర్గయ్య, పాయలపాక బాలరాజు, అడిగే వినయ్ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కలను సాకారం చేసిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత భావంతో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కి పట్టం కట్టి సోనియాగాంధీ రుణాన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందని తెలిపారు తెలంగాణ రాష్ట్రం వస్తే సబ్బండవర్ణాలు బాగుపడతాయని భావించి ఇచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడిందని తెలిపారు నీళ్లు నిధులు నియామకాల మీద జరిగిన ఉద్యమం నేడు తెలంగాణ వచ్చాక నీళ్లు గజ్వేల్ కి నియామకాలు కేసీఆర్ కుటుంబానికి నిధులు బిఆర్ఎస్ నాయకుల జేబుల్లోకి వెళ్లాయని తెలిపారు సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ గారు తొమ్మిదో ప్యాకేజీ కింద ఉన్న ఎగువ మానేరును ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదో ఇక్కడి రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇల్లు లేని నిరుపేదలకు ఐదు లక్షల రుణ సహాయం మహిళలకు 500 కే గ్యాస్ సిలిండర్ 2 లక్షల రుణమాఫీ అర్హులైన వారందరికీ పెన్షన్లు అధికారంలోకి వచ్చినా మొదటి సంవత్సరంలోనే ఖాళీగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తుందని కావున రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హమీద్, ఎంపిటిసి పరుశరాములు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎడబోయిన ప్రభాకర్, రామచంద్రారెడ్డి, అంజిరెడ్డి,గంగి స్వామి, సతీష్ రెడ్డి, మేడ భాస్కర్,విఠల్ నాయక్ తదితరులు పాల్గొన్నార.
నాని, కిరణ్ అబ్బవరం కి పాన్ ఇండియాలో మంచి గుర్తింపు ఉందా..?