మాంసాహారం ఎప్పుడు తినకూడదో తెలుసుకుందాం

సాధారణంగా పూజలు, వ్రతాలు, దీక్షలు చేసే సమయంలోను మరియు పర్వదినాలలో మాంసాహారాన్ని భుజించడం నిషిద్ధం అని మన పెద్దలు చెప్పుతారు.

మాంసాహారం తమో గుణాన్ని, రజో గుణాన్ని ప్రేరేపిస్తుంది.ఆధ్యాత్మికమైన పనులు చేసేటప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉండాలి.

అందువల్ల మాంసాహారంనకు దూరంగా ఉండాలి.భగవంతున్ని ఎప్పుడు సాత్విక భావనలతో స్మరించాలి.

అంతేకాకుండా మాంసాహారం జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది.ఆ జీర్ణ క్రియ ప్రభావంతో మెదడు తాత్కాలికంగా చురుకుదనాన్ని కోల్పోయి మందకొడిగా మారుతుంది.

అందుకని దైవ దర్శనానికి వెళ్ళే ముందు మరియు దైవకార్యాలు చేసేటప్పుడు మాంసాహారాన్ని తినకూడదని పెద్దలు చెబుతారు.

మాంసాహారం తిన్నప్పటికీ స్నానం చేసి లేదా తలంటు స్నానం చేసి దర్శనం చేసుకోవచ్చని కొందరు భావిస్తారు.

కానీ అది ఎంతమాత్రమూ మంచి పద్దతి కాదు.