మంజూరైన డిగ్రీ కళాశాలను కాపాడుకుందాం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddype ) మేజర్ గ్రామ పంచాయతీ కి మంజూరైన డిగ్రీ కళాశాల( Degree College )ను కాపాడుకుందాం అని ఎల్లారెడ్డిపేట డిగ్రీ కళాశాల ఇంచార్జీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రావు అన్నారు.

ఎల్లారెడ్డి పేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో డి ఆర్ డీ ఏ ( సేర్ప్ అధికారులు)తో డిగ్రీ కళాశాల కాపాడుకునేందుకు మీ వంతు భాగస్వామ్యులు కావాలని సమావేశానికి హాజరైన వారిని కోరారు.

ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ కోరిక మేరకు సేర్ప్ ఎపిఎం మల్లేశం ఆదేశాల మేరకు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తో సమావేశమయ్యారు.

వయసుతో సంబంధం లేకుండా ఇంటర్ పూర్తి అయిన వారిని ఇట్టి డిగ్రీ కళాశాల లో చర్పించడానికి కృషి చేయాలని కోరారు.

బిఎ.బికాం ,బిఎస్సీ, తదితర కోర్సుల్లో విద్యాబోధన చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.

భవిష్యత్ లో ఇట్టి చదువులు జీవితంలో చాలా ఉపయోగ పడుతుందనీ అన్నారు.గ్రామాల్లో కొత్తగా వచ్చిన కోడళ్ళు ఇంటర్ పూర్తయిన తర్వాత అనివార్య కారణాల వల్ల డిగ్రీ చదవలేకపోయినా వారు ఇట్టి అవకాశం వినియోగించుకోవాలని అన్నారు.

చదువుకునే సమయంలో సంవత్సరానికి అయిదు వేల రూపాయలు ఉపకార వేతనం గా అందించడం జరుగుతుందనీ అన్నారు.

ఈ సమావేశంలో సేర్ప్ ఉద్యోగులతో పాటు ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్, ఏ బి విపి రాష్ట్ర హాస్టల్స్ కో - కన్వీనర్ మారవేని రంజిత్ యాదవ్,డిగ్రీ కళాశాల ఇన్చార్జి ప్రభాకర్ రావు రాగట్లపల్లి మాజీ ఉపసర్పంచ్ లు మాందాటి సతీశ్ యాదవ్,మానుక సురేష్ యాదవ్,బి జె వై ఎం నాయకులు మాందాటి లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

చైనాలో వ్లాగ్ చేస్తూ అతి చేసిన భారతీయ యువతి.. ఫైర్ అవుతున్న నెటిజన్లు..?