మొక్కలు పెంచుదాం ఆరోగ్యం పంచుదాం హరిత ప్రేమికుడు దుంపెన రమేష్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: మొక్కలు పెంచుదాం ఆరోగ్యం పంచుదామని హరిత ప్రేమికుడు సామాజిక కార్యకర్త దుంపెన రమేష్ పిలుపునిచ్చారు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉసిరి, జామ, దానిమ్మ, గన్నేరు, మందార, మల్లె, మొదలగు 480 మందికి మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు.
కార్తీక మాసంలో ఉసిరి మొక్కకు ప్రాధాన్యత ఉందని మొక్కలు తన ఇంటికి వచ్చి ఉచితంగా తీసుకువెళ్లాలని ఆయన కోరారు.
అందరూ ఇంటింటా మొక్కలు పెంచుదాం పర్యావరణాన్ని కాపాడుకుందామని ఆయన ప్రచారం చేస్తూ ఒక 18 సంవత్సరాల నుండి మొక్కలను పంచుతూ ముందుకు సాగుతున్నారు, ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు గుండాడి వెంకట్ రెడ్డి, శ్రీ లక్ష్మి కేశవ పెరుమల్ల స్వామి ఆలయ చైర్మన్ పారిపెల్లి రాంరెడ్డి, తడకల స్వామి, బాలగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రాజమౌళికి జక్కన్న అని పేరు పెట్టింది ఎవరో తెలుసా… ఈ పేరు వెనుక ఇంత కథ ఉందా?