ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణలో బహుజన రాజ్యాన్ని స్థాపిద్దాం

సూర్యాపేట జిల్లా:వీరనారి చిట్యాల (చాకలి)ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణలో బహుజన రాజ్యాన్ని స్థాపిస్తామని బహుజన సమాజ్ పార్టీ కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు గుండెపంగు రమేష్ అన్నారు.

చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి వేడుకలను కోదాడ పట్టణంలోని వీరనారి విగ్రహం వద్ద బహుజన సమాజ్ పార్టీ కోదాడ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఐలమ్మ పోరాట స్పూర్తితో తెలంగాణలో బహుజన జెండాను ఎగరేస్తామని అన్నారు.

చాకలి ఐలమ్మ గారు భూమికోసం,భుక్తి కోసం,పేద ప్రజల విముక్తి కోసం,భూస్వాములు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దీరవనిత అని కొనియాడారు.

అదేవిధంగా పేద ప్రజల వద్ద నుండి బలవంతంగా తీసుకున్నటువంటి భూములను భూస్వాముల వద్ద నుండి గుంజి భూమిలేని నిరుపేదలకు పంచినటువంటి గొప్ప నాయకురాలు చాకలి ఐలమ్మని అన్నారు.

కానీ,నేడు టిఆర్ఎస్ ప్రభుత్వం పేదలు సాగు చేస్తున్నటువంటి భూములను గుంజుకొని ప్రాజెక్టుల పేరుమీద బడా కాంట్రాక్టర్లకు అప్పగిస్తుందని,ఎన్నో ఏండ్లుగా సాగు చేస్తున్నటువంటి పోడు భూములను పేదల దగ్గర నుంచి బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.

రాబోయే కాలంలో బిఎస్పీ అధికారంలోకి వస్తుందని,చాకలి ఐలమ్మ కలలుగన్నట్టుగా భూమిలేని ప్రతి పేదవాడికి భూమి అందేవిధంగా చేస్తుందని, పోడు భూములకు పట్టాలిచ్చి పేద ప్రజలను ఆదుకుంటామని తెలిపారు.

చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆత్కూరు సంజీవ్,బిఎస్పి జిల్లా కార్యదర్శి దాసరి జయసూర్య,తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులు బాలరాజు,కోదాడ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మామిడి రవి కుమార్ గౌడ్,కోశాధికారి కందుకూరి ఉపేందర్,నిర్మల తదితరులు పాల్గొన్నారు.

ఈ యూకే ఖైదీ చాలా డేంజరస్.. 50 ఏళ్లుగా జైల్లోనే..?