దేవుడు చెప్పాడని కన్న బిడ్దలను హత్యచేసిన కన్న తల్లికి 120 ఏళ్ల జైలు శిక్ష
TeluguStop.com
2015 తన కన్న బిడ్డలనే దారుణంగా హత్య చేసిన కన్న తల్లికి న్యాయస్థానం 120 ఏళ్ల శిక్ష విధించినట్లు తెలుస్తుంది.
వివరాల్లోకి వెళితే.అమెరికా లోని ఈస్ట్ హెవెన్ ప్రాంతానికి చెందిన లి రోయా మూరే 2015 లో దేవుడు ఆదేశించాడు అని చెబుతూ తన ఆరేళ్ల కుమార్తె ఆలీషా,ఏడేళ్ల కుమారుడు డారన్ ను హత్య చేసిన ఘటన లో పెను సంచలనం సృష్టించింది.
తన సొంత బిడ్లను హత్య చేయడమే కాకుండా మూడు రోజుల పాటు వారి మృతదేహాల పక్కనే పడుకుంది.
అయితే అక్కడి స్థానికులకు మూరే ఇంటి నుంచి దుర్వాసన రావడం తో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడం తో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
"""/"/
తన పిల్లలను దేవుడే చంపమని చెప్పారని,మళ్లీ వారిని బతికించేందుకు మృతదేహాలను తన ఇంట్లోనే ఉంచినట్లు పోలీసుల విచారణలో ఆమె తెలిపిన విషయాలు విని పోలీసులే అవాక్కయ్యారు.
దీనితో ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించిన పోలీసులు ఈ ఏడాది మార్చిలో దర్యాప్తు పూర్తి చేశారు.
దీనితో ఈ కేసును విచారించిన అమెరికా లోని ఒక న్యాయస్థానం ఆమెకు ఇద్దరు పిల్లలను హత్య చేసినందుకు గాను 60 ఏళ్ల చొప్పున 120 ఏళ్ల పెరోల్ కు సాధ్యం కానీ జైలు శిక్ష విధించినట్లు తెలుస్తుంది.
యూకేలో విషాదం .. రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధి దుర్మరణం