రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది.తంగళ్లపల్లి మండలంలో చిరుత సంచరిస్తోందని స్థానికులు గుర్తించారు.

గోపాల్ రావుపల్లిలో లేగదూడపై చిరుత దాడికి పాల్పడింది.దీంతో సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

చిరుత ఎప్పుడు, ఎవరి మీద దాడి చేస్తుందోనన్న భయంతో బ్రతుకున్నామని వాపోతున్నారు.అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు.