నంద్యాల జిల్లా చనుగొండ్లలో చిరుత సంచారం

నంద్యాల జిల్లా చనుగొండ్లలో చిరుత పులి( Cheetah ) సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

రెండు పిల్లలతో చిరుత సంచరిస్తున్నట్లు రైతులు గుర్తించారు.ఈ క్రమంలో చిరుత సంచారంపై సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

గ్రామానికి సమీపంలోనే కనిపించడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు.అనంతరం చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

ఫారెస్ట్ అధికారులు( Forest Officials ) త్వరగా స్పందించి చిరుతను బంధించాలని స్థానికులు కోరుతున్నారు.