కారుపై అటాక్ చేసిన చిరుత.. చివరికి జరిగిందిదీ!

అడవిలో ఉండే జంతువులు ఇటీవల కాలంలో జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి.అడవులలో ఆహారం, నీరు దొరకక పోవడంతో ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి.

ఇటీవల కాలంలో ఏపీలోని కాకినాడ జిల్లాలో ఓ పులి ప్రజలను బెంబేలెత్తిస్తోంది.పదుల సంఖ్యలో కెమెరాలు పెట్టి నిఘా వేసినా తప్పించుకు తిరుగుతోంది.

ఇదే కోవలో ఓ ఎలుగుబంటి శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో పలువురిపై దాడి చేసింది.

ఇప్పటికే నలుగురు ప్రాణాలతో పోరాడుతున్నారు.ఇలా అడవిలో జంతువులు జనావాసాల్లోకి వచ్చి దాడులు చేస్తుండడం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది.

ఈ ఘటనను తలపిస్తూ ఓ చిరుత రహదారిపై కారులో వెళ్తున్న వారిపై దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. """/"/ ఓ హైవేపై కొందరు కారులో వెళ్తుండగా సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుత వారి వాహనంపై దాడి చేసింది.

కోపంతో కారుపై పంజా విసిరి తన ప్రతాపం చూపించింది.అంత వరకు బాగానే ఉన్నా, దాని కాళ్లు కారు బోనెట్‌లో ఇరుక్కుపోయాయి.

దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ చిరుత అయోమయంలో పడిపోయింది.ఇక కారు నడుపుతున్న వారు తమ వాహనాన్ని కొంచెం వెనక్కి పోనివ్వడంతో ఆ చిరుత బయటపడింది.

బతుకు జీవుడా అంటూ క్షణాల్లో అక్కడి నుంచి తుర్రుమంది.అందరూ చూస్తుండగానే రహదారి పక్కనే రక్షణ గోడ దూకి, నిర్మానుష్య ప్రాంతానికి పరుగు తీసింది.

ఈ వీడియోను ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ వీడియో తీసి, ట్విట్టర్‌లో పెట్టారు.

దీంతో ఆ చిరుత అవస్థపైనా, అది దాడి చేసినప్పుడు కారులో ఉన్నవారి భయంపైనా ఫన్నీగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Samantha Naga Chaitanya : సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోడానికి ఫోన్ ట్యాపింగ్ కారణమా?