పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించిన చిరుత.. దెబ్బకి దడుసుకున్న పోలీసు!
TeluguStop.com
తమిళనాడు రాష్ట్రం, నీలగిరి( Nilgiris ) జిల్లాలోని గూడలూరు నుంచి ఊటీకి వెళ్లే జాతీయ రహదారిలో ఉన్న నడువట్టం బజార్‌లో రాత్రి సమయంలో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది.
సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఒక చిరుతపులి( Leopard ) నడువట్టం పోలీస్ స్టేషన్లోకి( Naduvattam Police Station ) ప్రవేశించింది.
చీకటి వేళ కావడంతో, చెట్లలో దాగున్న చిరుత బజార్ ప్రాంతం దాటి నేరుగా పోలీస్ స్టేషన్లోకి వచ్చింది.
అలా వచ్చిన చిరుత మొదటగా స్టేషన్‌లోని ప్రవేశ ద్వారాన్ని దాటి లోపలికి వెళ్లింది.
అక్కడ ఇన్స్పెక్టర్ కూర్చునే గదికి వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించింది.ఆ సమయంలో మరో గదిలో విధులు నిర్వర్తిస్తున్న ఒక పోలీస్ ఈ దృశ్యాన్ని చూసి షాక్‌కు లోనయ్యారు.
చిరుత గదిలోకి రావడం చూసి భయంతో గుండె ఆగినంత పనైంది ఆయనకు.ఏ రకంగా స్పందించాలో తెలియక తను ఉన్న స్థలంలోనే కదలకుండా ఉండిపోయాడు.
"""/" /
అయితే, చిరుత గదిలో తినేందుకు ఏమీ లేదని గుర్తించి మళ్లీ వచ్చిన దారినే నడుచుకుంటూ బయటికి వెళ్లిపోయింది.
చిరుత బయటకు వెళ్లిన తర్వాత గదిలో ఉన్న పోలీస్ మెయిన్ తలుపు వద్దకు వచ్చి జాగ్రత్తగా చూసి, చిరుత వెళ్లిపోయినట్లు నిర్ధారించుకున్నారు.
అనంతరం తలుపు మూసి ఊపిరి పీల్చుకున్నారు.ఈ సంఘటన అనంతరం ఉన్నతాధికారులకు సమాచారం అందించబడింది.
వన్యప్రాణి శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని చిరుత కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
ఈ సంఘటన పోలీస్ స్టేషన్( Police Station ) సిబ్బందిలో భయాన్ని కలిగించడమే కాక, పెద్ద ఎత్తున కలకలమూ రేపింది.
"""/" /
ఈ దృశ్యం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో కూడా రికార్డయింది.సమాచారం తెలియగానే స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు.
చిరుతను త్వరగా పట్టుకోవాలని, అవసరమైతే బోన్స్ ఏర్పాటు చేసి వేశారు పట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.