Leo Movie : తెలుగు రాష్ట్రాల్లో 4 గంటలకే లియో షోలు.. విజయ్ చరిత్రను తిరగరాస్తున్నారా?
TeluguStop.com
తమిళ స్టార్ హీరో విజయ్( Vijay ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
విజయ్ దళపతికి తమిళంతో పాటు తెలుగులో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిందే.
విజయ్ నటించిన తమిళ సినిమాలు తెలుగులోకి విడుదల అయి మంచి సక్సెస్ ను సాధించాయి.
ఇది ఇలా ఉంటే తమిళ హీరో విజయ్ తాజాగా నటించిన చిత్రం లియో.
ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
"""/" /
కాగా ప్రస్తుతం తమిళనాడు( Tamil Nadu )తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ లియో( Leo Movie ) ఫీవర్ బాగానే ఉందని బుకింగ్స్ స్పష్టం అవుతోంది.
భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు లాంటి తీవ్రమైన పోటీని పెట్టుకుని కూడా ఇంత క్రేజ్ తెచ్చుకోవడం మాములు విషయం కాదు.
సరిహద్దుల్లో ఉండే సూళ్లూరు పేట, నగరి, చిత్తూరు, నెల్లూరు లాంటి ఊళ్ళలో తెల్లవారుఝామున నాలుగు గంటల షోలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఎలాగూ తమ రాష్ట్రంలో 9 కన్నా ముందు షోలు పడవు కాబట్టి విజయ్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో బోర్డర్ షో లకు పోటెత్తుతున్నారు.
అంతే కాకుండా హైదరాబాద్ లాంటి చోట్ల రెగ్యులర్ షోలకు సైతం మంచి డిమాండ్ కనిపిస్తోంది.
"""/" /
విజయ్ ఇమేజ్ ఒకటే దీనికి కారణమని కూడా చెప్పలేం ఓపెనింగ్స్ పరంగా ఏపీ, తెలంగాణలో అక్టోబర్ 19న క్రేజీ నెంబర్లు నమోదయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉంది.
స్క్రీన్ కౌంట్ పరంగా బాలయ్యదే పై చేయి కానుంది.ఇక మిగిలిన చోట్ల చూస్తే బెంగళూరులో లియో ఫీవర్ పీక్స్ కు చేరుకుంది.
ఒక్క ఐమాక్స్ ప్రీమియర్ టికెట్ 2500 రూపాయలు అధికారికంగా పెట్టినా సరే ఆన్ లైన్ లో సోల్డ్ అవుట్ బోర్డు వెక్కిరిస్తోంది.
ఇక్కడే ఇలా ఉంటే చెన్నై పరిస్థితి వేరే చెప్పనక్కర్లేదు.మొత్తానికి లియో సినిమాతో విజయ్ చరిత్రను తిరగ రాయబోతున్నాడు.
భర్త కోసం ఈమె పెట్టిన కండీషన్స్ చూస్తే దిమ్మతిరగాల్సిందే.. 2.5 కోట్ల జీతమట..