Lenovo : ట్రాన్స్ పరెంట్ స్క్రీన్ ల్యాప్ టాప్ ను ఆవిష్కరించిన లెనోవో..!
TeluguStop.com
ప్రముఖ టెక్ దిగ్గజం లెనోవో( Lenovo ) ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్ పరెంట్ స్క్రీన్ ల్యాప్ టాప్ ను ఆవిష్కరించింది.
బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో దీనిని ప్రదర్శించింది.
ఈ ల్యాప్ టాప్ లో ఉండే ప్రత్యేకమైన ఫీచర్లు ఏమిటో చూద్దాం.ఈ ల్యాప్ టాప్ 17.
3 అంగుళాల బోర్డర్ లెస్ స్క్రీన్( Border Less Screen ) తో ఉంటుంది.
పిక్సెల్ లు నలుపుకు సెట్ చేసినప్పుడు 55శాతం వరకు పారదర్శకత ఉంటుంది.పిక్సెల్ లు పెంచి బ్రైట్ నెస్ ఎక్కువ చేసినప్పుడు డిస్ ప్లే తక్కువ పారదర్శకతగా మారుతుంది.
1000 నిట్స్ గరిష్ట బ్రైట్ నెస్, 720 పిక్సెల్ డిస్ ప్లే కలిగి ఉంటుంది.
ఇందులో మైక్రో LED డిస్ ప్లే( Micro LED Display ) తో ఉంటుంది.
OLED డిస్ ప్లే తో పోలిస్తే మైక్రో LED డిస్ ప్లే మెరుగైన ప్రకాశం, చిత్ర నాణ్యత,పారదర్శకత అందిస్తుంది.
"""/"/
ఈ ల్యాప్ టాప్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం( Windows 11 Operating System ) ఆధారంగా పనిచేస్తుంది.
లెనోవో కాన్సెప్ట్ వీడియో ఫ్లాట్ టచ్ కీబోర్డును కూడా చూపించింది.కీబోర్డుగా కాకుండా ప్రొజెక్షన్ గా ఉంటుంది.
పెన్ ను థింక్ బుక్ కు దగ్గరగా తీసుకువచ్చినప్పుడు కీబోర్డుగా మారుతుంది.దీని సాయంతో కళాకారులు స్కెచ్ వేయవచ్చు.
ఫ్లోటింగ్ ఫుట్ ప్యాడ్ డిజైన్ దీనిలో ఉన్నాయి.లెనోవో థింక్ ప్యాడ్ పోర్ట్ ఫోలియో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టామ్ బట్లర్ మాట్లాడుతూ ఈ సాంకేతికతపై కంపెనీకి చాలా ఎక్కువ విశ్వాసం ఉందని తెలిపారు.
"""/"/
ఈ ల్యాప్ టాప్ అందుబాటులోకి రావడానికి ఐదేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.
లెనోవో తక్కువ బడ్జెట్లో బెస్ట్ గ్యాడ్జెట్లు మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉండడంతో లెనోవో కు చెందిన స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
ఇక ఈ సరికొత్త ల్యాప్ టాప్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.